Jupiter: భూమిని రక్షించిన బృహస్పతి.. లేకుంటే
అవును భూమిని మీరు చదివింది నిజమే. భూమి సౌరవ్యవస్థలోకి కుప్పకూలిపోకుండా గురుగ్రహం కాపాడిందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తాజాగా వెల్లడైంది. రైస్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ఈ ఆశ్చర్యకర విషయం వెలుగుచూసింది. మన పురాణాల్లో దేవతలకు గురువుగా చెప్పే బృహస్పతినే గురుగ్రహంగా ప్రస్తావించారు.
శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం.. గ్యాస్ జెయింట్ అయిన గురు గ్రహం ప్రారంభంలో వృద్ధి చెందుతుండటం వల్ల సౌర వ్యవస్థ లోపలివైపునకు గ్యాస్, ధూళి దూసుకెళ్లకుండా అడ్డుకట్ట పడింది. దీంతో ఆ ధూళి పదార్థమే .. కాలక్రమంలో భూమి, శుక్ర, కుజ గ్రహాలుగా ఏర్పడింది. గురు గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి మూలంగానే.. సౌరమండలంలోని గ్రహాలు.. స్థిరత్వం పొంది నిర్థిష్ట కక్షల్లో స్థిరపడగలిగాయని ఈ పరిశోధన నిర్ధారించింది. ఇప్పుడు మనం చూస్తున్న నిర్దిష్టమైన సౌరమండలం ఈ రూపంలోకి రావటానికి గురు గ్రహమే కారణమని పరిశోధకులు చెబుతున్నారు. గురు గ్రహం యొక్క భారీ గురుత్వాకర్షణ శక్తి కారణంగానే.. రోదసిలో తిరిగే ఉల్కలు, తోకచుక్కలు, భారీ గ్రహశకలాలను భూమి వైపు రాకుండా ఉండటం సాధ్యమైంది. లేకపోతే, భూమి తరచుగా అంతరిక్ష వస్తువుల వల్ల దెబ్బతినేది. అదే జరిగినట్లయితే.. ఈ గ్రహం మీద జీవరాసుల మనుగడ ఏనాడో నాశనమైపోయేది. ఈ అధ్యయనాన్ని నిర్వహించిన వారిలో ఒకరైన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎర్త్ ఆండ్రీ ఇజిడోరో మాట్లాడుతూ.. గురు గ్రహం కేవలం ఓ భారీ గ్రహం మాత్రమే కాదని, సౌర వ్యవస్థలోని లోపలి భాగం మొత్తానికి ఒక అరుదైన, అద్భుత వ్యవస్థను ఏర్పరచిందని,నిజంగా గురు గ్రహమే లేకపోతే, మన భూమి ఉండేది కాదని చెప్పారు. గ్యాస్ జెయింట్ అంటే భారీగా వాయువులతో నిండిన గురువు భూమి కంటే చాలా పెద్దది. ప్రధానంగా హైడ్రోజన్, హీలియం వంటి వాయువులతో నిండిన ఈ గ్రహం మీద గట్టి ఉపరితలం ఉండదు. సౌర వ్యవస్థలోని బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి గ్రహాలు అలాంటివే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గంటకు 85 కి.మీ వేగంతో కదులుతున్న మొంథా
మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. విశాఖలో కూలిన భారీ వృక్షం
ఓడలరేవు దగ్గర సముద్రం కల్లోలం.. ఎగసిపడుతున్న రాకాసి అలలు
డ్రైవర్పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

