బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది  మృతి

బద్దలైన అగ్ని పర్వతం.. 11 మంది మృతి

Phani CH

|

Updated on: Dec 05, 2023 | 9:40 PM

ఇండోనేషియా లోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. ఆదివారం సుమత్రా దీవిలో మౌంట్‌ మరపి లో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

ఇండోనేషియా లోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఈ ఘటనలో 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో 12 మంది ఆచూకీ గల్లంతైంది. ఆదివారం సుమత్రా దీవిలో మౌంట్‌ మరపి లో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అగ్ని పర్వతం విస్ఫోటనం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు తమ వద్ద సమాచారం ఉందనీ, వారిలో 49 మందిని కాపాడగా 11 మంది మరణించారనీ పడాంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ తెలిపారు. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సివుందనీ కాపాడిన వారిలో స్వల్పంగా గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Narasaraopeta: నర్సారావు పేట సూపర్ మార్కెట్ లో అగ్నిప్రమాదం

ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తానంటున్న టిక్ టాక్ ‘జుమ్ చక’ స్టార్

Michaung Cyclone: నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం

బిర్యానీలో బల్లిని చూసి ఎలా షాకయ్యరో చూడండి

ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌ వెనక హైదరాబాదీల కృషి..