Israel – Gaza: ఖాన్ యూనిస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు.. 24 గంటల్లో 700 మంది మృతి.
కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గాజాలో రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌ను లక్ష్యం చేసుకుంది. ఆ నగరంలోనే హమాస్ కీలక నేతలు దాక్కున్నారని అనుమానిస్తోంది. అందుకే ఖాన్ యూనిస్‌ను తక్షణం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ పోస్టర్లను జారవిడుస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతోంది. దీంతో చాలా మంది రఫా నగరంవైపు తరలుతున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా గాజాలో రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్‌ను లక్ష్యం చేసుకుంది. ఆ నగరంలోనే హమాస్ కీలక నేతలు దాక్కున్నారని అనుమానిస్తోంది. అందుకే ఖాన్ యూనిస్‌ను తక్షణం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ పోస్టర్లను జారవిడుస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపుతోంది. దీంతో చాలా మంది రఫా నగరంవైపు తరలుతున్నారు. అటు జబాలియా శరణార్థి శిబిరంపై ఆదివారం మరోసారి ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో శిబిరంలోని నివాస గృహాలు ధ్వంసమయ్యాయని, పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని స్థానిక అధికారులు తెలిపారు. గత మూడు రోజుల్లో జబాలియాపై ఇది రెండో దాడి.
గాజాలో హమాస్ మిలిటెంట్లు కార్యకలాపాలు నిర్వహిస్తున్న 800కు పైగా సొరంగాలను కనుగొన్నామని ఆదివారం ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇందులో దాదాపు 500 సొరంగాలను నాశనం చేశామని తెలిపింది. నివాస గృహాలు, విద్యాసంస్థలు, మసీదులు, క్రీడా మైదానాల కిందే చాలా సొరంగాలు ఉన్నాయని పేర్కొంది. కొన్నింటిలో హమాస్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం సెగలు ఫ్రాన్స్‌ను తాకాయి. పారిస్ వీధుల్లో తిరుగుతూ కనిపించిన వారిపై కత్తితో దాడి చేశాడు ఓ నిరసనకారుడు. ఈ దాడుల్లో జర్మనీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. పాలస్తీనాలో ముస్లింలు చనిపోతున్నారనే ఆవేదనతోనే నిందితుడు దాడులు చేశాడని హోంమంత్రి గెరాల్డ్ డర్మానిన్ తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.