Italy: ప్రియురాలికి రూ.906 కోట్ల ఆస్తి రాసిచ్చిన మాజీ ప్రధాని.. వీడియో.
తనకు ప్రేమను పంచిన ప్రియురాలికి కొద్దో గొప్పో కాదు.. ఏకంగా 906 కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చాడు ఈ పెద్దాయన.. అటు వ్యాపారం.. ఇటు రాజకీయం.. మీడియా.. అన్ని రంగాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని.
తనకు ప్రేమను పంచిన ప్రియురాలికి కొద్దో గొప్పో కాదు.. ఏకంగా 906 కోట్ల రూపాయల ఆస్తి రాసిచ్చాడు ఈ పెద్దాయన.. అటు వ్యాపారం.. ఇటు రాజకీయం.. మీడియా.. అన్ని రంగాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు ఇటలీ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని. లుకేమియాతో బాధపడుతున్న 86 ఏళ్ల బెర్లుస్కోనీ.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు గురై గత నెలలో ప్రాణాలు విడిచారు. అయితే, తాజాగా, బెర్లుస్కోనికి సంబంధించి ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్నాళ్లుగా మార్తా ఫాసినా అనే 33 ఏళ్ల మహిళతో బెర్లుస్కోని ప్రేమాయణం సాగిస్తున్నారు. ఇద్దరి మధ్య 53 ఏళ్ల వయోభేదం ఉన్నప్పటికీ.. వారి ప్రేమకు వయసు అడ్డురాలేదు. ఈ నేపథ్యంలో తన మది దోచిన ప్రియురాలు ఫాసినా పేరిట 906 కోట్ల రూపాయల ఆస్తిని బెర్లుస్కోనీ రాశారు. ఈ మేరకు తన వీలునామాలో పేర్కొన్నారని ప్రముఖ పత్రిక కథనం పేర్కొంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...