Company bans smoking video: నో స్మోకింగ్.. వర్క్ ఫ్రమ్ హోమ్ ..ఓ కంపెనీ ఆదేశాలు..!(వీడియో).
స్మోకింగ్ చేయకండి, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పటికీ కూడా. అంటూ ఓ కంపెనీ స్టాఫ్ ను ఆదేశించింది. మరి ఇంట్లో స్మోక్ చేస్తున్నారా లేదా ఎలా చూస్తారన్న డౌట వస్తుందా? దీని కోసం ప్రత్యేకించి నిఘాలాంటిదేమీ పెట్టం, ఉద్యోగులపై నమ్మకం.....
జపాన్‌లోని నొమురా హోల్డింగ్స్ అనే సంస్థ.. వర్క్ ఫ్రమ్ చేస్తున్నా సరే పని చేస్తున్న సమయంలో స్మోకింగ్ చేయకూడదని స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని తమ ఉద్యోగులందరికీ మెసేజ్ పంపించింది. డిసెంబర్‌లోగా ఆ సంస్థ నిర్వహిస్తున్న అన్ని స్మోకింగ్ రూమ్‌లను కూడా మూసివేయాలని నొమురా హోల్డింగ్స్ నిర్ణయించింది.
చాలా మంది ఉద్యోగులు ఆఫీస్‌లకు వచ్చినప్పుడు సిగరెట్లు తాగుతారు. అయితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పటి నుంచీ ఈ స్మోకింగ్ అలవాటు మరింతగా పెరిగినట్లు ప్రతి 10 మంది స్మోకర్లలో ఇద్దరు చెప్పారని వెల్లడించిన తాజా సర్వే డీటైల్స్‌ను కంపెనీ సీరియస్‌గా తీసుకుంది. ఇంట్లో స్మోకింగ్ పరిమితులేమీ ఉండకపోవడం వల్ల ఇది పెరిగిపోతోందని నేషనల్ క్యాన్సర్ సెంటర్ జపాన్ చెప్పింది. దీంతో నొమురాలాంటి సంస్థలు తమ ఉద్యోగులకు ఇలా ఆదేశాలు జారీ చేసాయి. తమ ఉద్యోగుల్లో 2020 మార్చి నాటికి 20 శాతం మంది స్మోకర్లు ఉండగా.. 2025 నాటికి దానిని 12 శాతానికి తగ్గించాలని నొమురా లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Proposal on Track Video: ట్రాక్‌పై లవ్.. అంధ అథ్లెట్‌కు ఆమె గైడ్ లవ్ ప్రపోజల్! వీడియో వైరల్.
Face Book: నల్లజాతీయుల్ని ‘కోతులు’ అన్నందుకు ఇరకాటంలో పడ్డ FB ..!(వీడియో).
Delta Variant: కొత్త కరోనా మరింత డేంజర్.. భారత్ లో ఏవై.12 కరోనా.. మొదలైన థర్డ్ వేవ్..(లైవ్ వీడియో).