ఇళ్లకు తాళాలు.. మంటల్లో భవనం.. బయటకు రాలేక.. సజీవసమాధులైన 10 మంది
చైనాలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు 10 మంది ప్రాణాలు తీశాయి. అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో నిబంధనలను కఠినతరం చేశారు.
చైనాలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు 10 మంది ప్రాణాలు తీశాయి. అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో నిబంధనలను కఠినతరం చేశారు. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో అయితే జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా గేట్లకు బయటి నుంచి తాళాలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఉరుమ్‌ఖ్వీ సిటీలోని ఓ రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదాన్ని గమనించి జనం ఇళ్ల నుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించగా ఎక్కడికక్కడ తాళాలు వేయడంతో కుదరలేదు. దాంతో చూస్తుండగానే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మరో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లాక్‌డౌన్ కారణంగా బిల్డింగ్ చుట్టూ కార్లు పార్క్‌చేసి ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకంగా మారింది. ఆలస్యం జరిగి ఉండకపోతే మరికొందరి ప్రాణాలైనా దక్కేవని స్థానికులు చెబుతున్నారు
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాత కానున్న బిల్‌గేట్స్.. కూతురి బేబీ బంప్ ఫొటోలు వైరల్..
2,500 మందితో నగ్న ఫోటోషూట్.. ఎందుకంటే ??
వామ్మో.. 66 ఏళ్ల వృద్ధుడిపై 31 అత్యాచార కేసులు !!
మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్ !!
పని మనిషితో శృంగారం చేస్తూనే.. ప్రముఖ వ్యాపారి మృతి !!