మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్‌ !!

మధ్య వేలు చూపాడని బైకర్‌ను చితకబాదిన ఆర్టీసీ డ్రైవర్‌ !!

Phani CH

|

Updated on: Dec 01, 2022 | 9:19 AM

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ బైకర్‌పై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ విచక్షణారహితంగా దాడిచేశాడు. ఐటీ సిటీ పరిధిలోని యెలహంకలో బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన రెండు బస్సులు వెళ్తున్నాయి.

కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ బైకర్‌పై ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ విచక్షణారహితంగా దాడిచేశాడు. ఐటీ సిటీ పరిధిలోని యెలహంకలో బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌కు చెందిన రెండు బస్సులు వెళ్తున్నాయి. ఒక బస్సును మరో బస్సు ఓవర్‌టేక్‌ చేస్తుండగా ఎదురుగా ఓ బైక్‌ వచ్చింది. బైక్‌ను గమనింనప్పటికీ బస్సు డ్రైవర్లు ఎవ్వరు తమ వాహనాల స్పీడ్‌ను తగ్గించుకోలేదు. దీంతో బైక్‌పై వెళ్తున్న సందీప్‌ అనే వ్యక్తి బస్సు డ్రైవర్‌కు మధ్యవేలు చూపించాడు. దీంతో బస్సును ఆపిన డ్రైవర్‌.. సందీప్‌పై పిడిగుద్దులతో దాడి చేశాడు. అతని బైక్‌ తాళం, ఫోను లాక్కుని వచ్చేశాడు. మరోసారి బస్సులోకి వచ్చిన ఆ వ్యక్తిని చితకబాదాడు డ్రైవర్. ఈ ఘటనను ప్రయాణికులు కొందరు తమ సెల్‌ఫోన్లలో బంధించి.. సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. విషయం తెలుసుకున్న బీఎంటీసీ అధికారులు ఆ బస్సు డ్రైవర్‌ను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పని మనిషితో శృంగారం చేస్తూనే.. ప్రముఖ వ్యాపారి మృతి !!

ఆటోమొబైల్ రంగంలో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సు వచ్చేసింది !!

బైక్ మీద వెళ్తున్న దొంగను పట్టుకోవడానికి పోలీసు సాహసం !! తెగువను చూసి నెటిజన్లు ఫిదా !!

ప్లాస్టిక్ కుర్చిలో ఇరుక్కున్న లేగ దూడ తల.. చుక్కలు చూసింది !!

చికెన్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. దడ పుట్టిస్తున్న నివేదిక!

Published on: Dec 01, 2022 09:19 AM