యువకుడి ప్రాణం తీసిన చెప్పు.. అది ఎలా అంటే? వీడియో
మధ్యప్రదేశ్‌లో అనుహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. సియోని జిల్లాలో ఉన్న పరేవా ఖోహ్ స్థానికంగా పర్యాటక స్థలంగా పేరు పొందింది. వర్షాకాలంలో నిండుగా పొంగే నదిని చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. కొండల నడుమ ప్రవహించే ఈ నది చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. జూలై 20 ఆదివారం సెలవు రోజు కావడంతో ఆయుష్ అనే 20ఏళ్ల యువకుడు.. ఐదుగురు స్నేహితులతో కలిసి పరేవా ఖోహ్‌కు సరదాగా వెళ్లాడు. అయితే అక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్న క్రమంలో అతడి చెప్పు అనుకోకుండా నదిలో పడిపోయింది.
నీళ్లలో తేలుతున్న ఆ చెప్పు నీటి అలల ధాటికి కొండరాళ్ల పైకివస్తూ పోతూ ఉంది. దీంతో అతడు ఓ కర్ర సాయంతో చెప్పును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. ప్రవాహంలో చెప్పు కొంచెం ముందుకు వెళ్లింది. ఆయుష్ కూడా రాళ్ల మీదుగా అక్కడికి పరుగులు తీశాడు. అయితే చెప్పును చేతితో తీసుకోవచ్చనుకున్నాడు. దీంతో ఆయుష్ చేయి చాపబోయాడు. రాళ్లపై ఉన్న పాచి కారణంగా పట్టుతప్పి అతడు నీళ్లలో పడిపోయాడు.అదే సమయంలో నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అతడు రాళ్లను పట్టుకుని బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ నదిలో ప్రవాహం దాటికి పట్టుదొరక్క.. స్నేహితుల కళ్ల ముందే కొట్టుకుపోయాడు. ఒడ్డున ఉన్న స్నేహితులకు ఏం చేయాలో తెలియక భోరున ఏడుస్తూ అక్కడి సిబ్బందికి సమాచారం అందించారు. గజఈతగాళ్ల సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. రంగంలోకి దిగిన ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందం.. చివరికి ఆయుష్ మృతదేహాన్ని బయటకు తీసింది.
మరిన్ని వీడియోల కోసం :
లైవ్ కవరేజ్ చేస్తూ.. వరదలో కొట్టుకుపోయిన జర్నలిస్ట్ వీడియో
కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో
ఇదెక్కడి చోద్యం.. ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్న బ్రదర్స్ వీడియో
నదిలో ఉండాల్సిన మొసలి.. రోడ్డుపైకి రావడంతో.. వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
