Viral Video: టామ్ అండ్ జెర్రీ చూసిన పిల్లి.. ఏం జరిగిందో చూస్తే నవ్వకుండా ఉండలేరంతే..!

టామ్ అండ్ జెర్రీ.. పిల్లలనే కాదు పెద్దలను ఆకట్టుకునే కార్టున్ షో. పిల్లి, ఎలుక మధ్య సాగే ఆట మనకు వినోదాన్ని అందిస్తుంది. ఎప్పుడు చూసిన ఈ షో నవ్వులు పంచడంలో మాత్రం ఫస్టే ఉంటుంది. అయితే, ఈ షోని ఓ పిల్లి కూడా చూసింది

Viral Video: టామ్ అండ్ జెర్రీ చూసిన పిల్లి.. ఏం జరిగిందో చూస్తే నవ్వకుండా ఉండలేరంతే..!
Tom And Jerry Viral Video

Viral Video: టామ్ అండ్ జెర్రీ.. పిల్లలనే కాదు పెద్దలను ఆకట్టుకునే కార్టున్ షో. పిల్లి, ఎలుక మధ్య సాగే ఆట మనకు వినోదాన్ని అందిస్తుంది. ఎప్పుడు చూసిన ఈ షో నవ్వులు పంచడంలో మాత్రం ఫస్టే ఉంటుంది. అయితే, ఈ షోని ఓ పిల్లి కూడా చూసింది. మరి అది చేసిన పనికి నెటిజన్లు కడుపుబ్బా నవ్వుతున్నారు. అందుకే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో విషయానికి వస్తే.. మాజీ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాప్‌మాన్ వైరల్ వీడియోలను షేర్ చేస్తూ.. నెటిజన్లను అలరిస్తుంటాడు. తాజాగా తన ఇంట్లో ఉన్న పిల్లి వీడియోను షేర్ చేసి ఆకట్టుకున్నాడు. ఈ ప్లేయర్ ఇంట్లో ఉన్న పిల్లి, టీవీలో వచ్చే టామ్ అండ్ జెర్రీలో వచ్చే ఓ ఎపిసోడ్‌ని చాలా ఆసక్తిగా చూస్తుంది.

అయితే జెర్రీ తన చేతిని బెలూన్‌లా పెద్దగా ఊది టామ్‌ని చెంపపై గట్టిగా కొట్టడంతో.. గట్టిగా సౌండ్ వస్తుంది. దీనికి భయపడిన పిల్లి అక్కడి నుంచి వెనక్కి చూడకుండా పారిపోతుంది. సరదాగా అనిపించే ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో 1.6మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట్లో దూసుకపోతోంది. అలాగే 11వేలకు పైగా రీటీట్స్.. 562 కామెంట్లు వచ్చాయి.

Also Read: Viral Video: మాములు బురదే అనుకున్నాడు.. అలా కాలు పెట్టాడో లేదో.. తరువాత ఏం జరిగిందంటే..!

Viral Video: కొండచిలువను పట్టి కరకరా నమిలి మింగేసిన మొసలి.. చూస్తే షాకవుతారు

చైనా సొరంగాల నిర్మాణం.. శాటిలైట్‌ రిలీజ్‌ చేసిన పిక్స్ వైరల్‌.!

Click on your DTH Provider to Add TV9 Telugu