Viral Video: ఇంత క్రూరత్వమా..! అడవి రాజైన నీకు ఇది న్యాయమే అనిపిస్తుందా..!

ప్రపంచంలో ఎవరు మనల్ని విడిచిపోయినా పర్లేదు.. అమ్మానాన్నలు మాత్రం మనతోనే ఉంటారు. మనం ఎంత పెద్దవాళ్లనైనా,  అది ఎలాంటి సిట్యువేషన్‌...

Viral Video: ఇంత క్రూరత్వమా..! అడవి రాజైన నీకు ఇది న్యాయమే అనిపిస్తుందా..!
Lion With Cubs
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 31, 2021 | 1:08 PM

ప్రపంచంలో ఎవరు మనల్ని విడిచిపోయినా పర్లేదు.. అమ్మానాన్నలు మాత్రం మనతోనే ఉంటారు. మనం ఎంత పెద్దవాళ్లనైనా,  అది ఎలాంటి సిట్యువేషన్‌ అయినా వారు ఆపన్న హస్తం అందిస్తారు. ఏ తల్లిదండ్రుకైనా పిల్లలతోనే ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి. ఇక త్యాగం విషయానికి వస్తే అమ్మానాన్నలకు మించిన వారు ఎవరుంటారు చెప్పండి. వారు కటిక నేలపైన పడుకుని అయినా, పిల్లలకు హాయిగా నిద్రపోయేలా చూస్తారు. వారు పస్తులున్నా సరే.. పిల్లలకు పంచభక్ష పరమాన్నాలు వండిపెడతారు. మనుషులే కాదు జంతువులు కూడా తమ పిల్లల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాయి. పెద్ద జంతువులు వచ్చి తమ పిల్లలపై ఎటాక్ చేస్తే.. వాటిని ఎదిరించే బలం లేకున్నా కయ్యానికి కాలుదువ్వుతాయి. అయితే తాజాగా ఒక మగ సింహం మాత్రం తండ్రి బాధ్యతలను విస్మరించింది. పిల్లలను వదిలేసి పరుగులు తీసింది. క్రూరత్వానికి ప్రతీకగా సింహాలు, పులుల గురించి చెబుతారు. ఎంత క్రూరత్వం ఉన్నా సరే.. ఇలా చిన్న పిల్లల్ని సదరు సింహం వదిలేసి వెళ్లడం నెటిజన్లను షాక్‌కు గురిచేసింది.

ముందుగా వీడియో వీక్షించండి…

వీడియోని గమనిస్తే.. తొలుత సింహం పిల్లలను మాయపుచ్చి తప్పించుకోడానికి ప్రయత్నించింది. వెంటనే అలెర్టైన పిల్లలు మళ్లీ తండ్రిని సమీపించడానికి ప్రయత్నించాయి. గమనించిన సింహం అక్కడనుంచి పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజికి మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో లైఫ్ అండ్ నేచర్ అనే ఖాతాతో ట్విట్టర్‌లో షేర్ చేయబడింది. నెటిజన్లు ఈ వీడియోపై తమ కామెంట్స్ తెలియజేస్తున్నారు. ‘బాల్యంలో ఉన్న పిల్లల బాధ్యతను వదిలేసి వెళ్తున్న తండ్రిని తొలిసారి చూస్తున్నాను’ అని ఓ యూజర్ కామెంట్ పెట్టాడు.

Also Read:దారుణం.. 300 వీధి కుక్కలకు విషం.. చనిపోయిన అనంతరం కూడా

నడుస్తూ ఉండగా వృద్దుడి కాళ్లను చుట్టేసిన విష సర్పం.. విడిపించుకున్నాక అతడు ఏం చేశాడో చూడండి