Viral Video: కొండచిలువను పట్టి కరకరా నమిలి మింగేసిన మొసలి.. చూస్తే షాకవుతారు

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Jul 31, 2021 | 10:01 AM

ఈ భూమ్మీద కనిపించే వివిధ జాతుల పాములలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది అన్న విషయం తెలిసందే. పెద్ద, పెద్ద జంతువులను...

Viral Video: కొండచిలువను పట్టి కరకరా నమిలి మింగేసిన మొసలి.. చూస్తే షాకవుతారు
Crocodile Attacks A Python

ఈ భూమ్మీద కనిపించే వివిధ జాతుల పాములలో కొండచిలువ అత్యంత ప్రమాదకరమైనది అన్న విషయం తెలిసందే. పెద్ద, పెద్ద జంతువులను సైతం అలవోకగా మింగి.. ఆకలి తీర్చుకోగల శక్తి  ఈ జీవికి ఉంది. కానీ కొన్నిసార్లు ప్రమాదకరమైన కొండచిలువ కూడా మరో జీవికి ఆహారం అవ్వొచ్చు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకువచ్చాం. నీటిలో ఉన్నప్పుడు మొసలి ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన ఏరియాలోకి వస్తే అడవికి రాజైన సింహనికి కూడా చుక్కలు చూపిస్తుంది. అయితే తాజా వీడియోలో కొలను సమీపంలోకి వచ్చిన కొండచిలువను.. నక్కి వేటాడి.. కరకర నమిలి మింగేసింది మొసలి.

ముందుగా వీడియో చూడండి…

వీడియోలో మీరు ఒక పెద్ద కొండచిలువ ఒక సరస్సు సరిహద్దులో పాకుతూ ఉండటం మీరు చూడవచ్చు. బహుశా దాహం తీర్చుకునేందుకో, స్నానం కోసమో అది అక్కడికి వచ్చి ఉండవచ్చు. దాన్ని గమనించిన ఓ మొసలి సరస్సు ఒడ్డుకు చేరుకుని కాపు కాచింది. సరైన సమయం చూసి ఒక్కసారిగా కొండచిలువపై ఎటాక్ చేసింది. పైథాన్‌కు మరో ఛాన్స్ ఇవ్వకుండా తన  దవడలలో కరకర నమిలి మింగేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ సర్కులేట్ అవుతుంది. నెటిజన్లు బాగా వీడియోను లైక్ చేస్తున్నారు. ‘బాప్ రే’.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆర్టికల్ రాసే సమయం వరకు ఈ వీడియోకు 75 వేల పైచిలుకు వ్యూస్ వచ్చాయి.

Also Read: Noni fruit: ఈ అద్భుత ఫలం 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేయగలదు..

బొమ్మ పడినా కనిపించని జోష్.. ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’ అన్నట్టుగానే సీన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu