Viral Video: రోడ్డుపైనే వరమాల సందడి.. పాపం వధువు.. ఎంతలా కష్టపడిందో చూడండి
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల వరద కొనసాగుతోంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ప్రతి వివాహానికి సంబంధించిన పలు రకాల వీడియోలు నెట్టింట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.
Viral Video: ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పెళ్లి వీడియోల వరద కొనసాగుతోంది. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఇలా ప్రతి వివాహానికి సంబంధించిన పలు రకాల వీడియోలు నెట్టింట్లో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ వీడియోలలో కొన్ని ఫన్నీగా ఉండి, నవ్విస్తే.. మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. ప్రస్తుతం ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నవ్వులు పూయిస్తోంది. వరమాల వేసే సమయంలో తీసిన ఈ వీడియోను నిరంజన్ మోహపాత్రా అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. వీడియోలో ఏముందంటే.. వధువు వరమాలను పట్టుకుని వరుడు మెడలో వేసేందుకు తెగ తంటాలు పడుతుండటాన్ని చూడొచ్చు. ఇరువురి బంధువుల సమక్షంలో ఈ తంతు రోడ్డుపైనే జరిగింది. అయితే, వధువును కుర్చీలో కూర్చోబెట్టి మరీ బంధువులు ఎత్తుకున్నారు. వరమాల పట్టుకుని వరుడి మెడలో వేసేందుకు ప్రయత్నించగా.. వరుడు తప్పించుకుంటుంటాడు.
ఇద్దరూ పోటీపడుతూ గెలిచేందుకు ప్రయత్నించడం నవ్వులూ పూయిస్తుంది. కాగా, వధువు మాత్రం వరుడి మెడలో వరమాలను వేయకపోవడం కొసమెరుపు. అయితే అప్పటికే వరుడి మెడలో ఓ దండ కూడా ఉండడం గమనించవచ్చు. అలాగే వధువు మెడలో మాత్రం దండ లేకపోవడం గమనించవచ్చు. దీనిని పక్కనున్న వారు షూట్ చేసి నెట్టింట్లో పంచుకోవడంతో తెగ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు. దీనిపై నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
Also Read: Viral Video: కుక్కను పట్టి నీళ్లలోకి లాగేసిన మొసలి.. చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
యూపీ ‘ఘాటు’..నడిరోడ్డులో క్యాబ్ డ్రైవర్ ను ‘ఉతికి ఆరేసిన’ యువతి..ఎందుకంటే..?