Viral Video: వధువు డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా.. నవ్వుకున్న వరుడు.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో
Trending Video: వీడియోలో వధూవరులు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్-కరీనా కపూర్ ల 'సౌదా ఖారా-ఖారా' పాటకు చిందులు వేశారు.
Viral Video: నెట్టింట్లో పెళ్లి వీడియోల హవా ఎన్నడూ కొనసాగుతూనే ఉంటుంది. ఇక వధూవరుల డ్యాన్స్ వీడియోలైతే చెప్పనక్కర్లేదు. ఇవి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తూ.. నెటిజన్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో వివాహ వేడుకలో వధూవరులు నృత్య వేదికపై నిలబడి ఉన్నారు. ఈ సందర్భంగా వరుడి స్నేహితులు, బంధువులు బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కరీనా కపూర్‌ల ‘సౌదా ఖారా-ఖారా’ పాటపై నృత్యం చేయడం ప్రారంభించారు. వరుడి కంటే వధువు చాలా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ సందడిగా కనిపించింది.
ఈ జంట అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కూడా వస్తున్నాయి. మరోవైపు వధువు డ్యాన్స్ చూస్తూ వరుడు నెమ్మదిగా నవ్వుకోవడం చూడవచ్చు. ఈ అందమైన వీడియోను నెటిజన్లు కూడా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోపై తమ అభిప్రాయాలను కూడా పంచుకున్నారు. ఇద్దరి నృత్య ప్రదర్శన నిజంగా అభినందనీయం అంటూ కామెంట్లు చేశారు. అలాగే చాలామంది ఈ వీడియోపై ఫన్నీ రియాక్షన్స్ పంచుకున్నారు. ఈ ఫన్నీ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో witty_wedding అనే ఖాతాలో షేర్ చేశారు.
View this post on Instagram
Viral Video: పెళ్లి వేదికపై మరీ ఇంతలానా.. వధువు చేసిన పనికి వరుడు షాక్.. చూస్తే నవ్వాపుకోలేరు!