థర్డ్ ఏసీ టికెట్ ఉన్నా ట్రైన్ ఎక్కలేక అవస్థ !! టికెట్ డబ్బులు వాపసు ఇవ్వాలని డిమాండ్
పండగ సమయాల్లో రైలు ప్రయాణం కష్టమే. కన్ఫమ్ టికెట్ ఉండి ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికిసమస్య అంతగా ఉండదు. కానీ .. దీపావళి సందర్భంగా రైల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి మధ్యప్రదేశ్‌లోని రత్లాం వెళ్తున్న అన్షుల్ శర్మ అనే ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నా ఫలితం లేకపోయింది. అతడు ఎక్కాల్సిన థర్డ్ ఏసీ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. కనీసం లోపలికి అడుగు పెట్టడానికి వీలులేకుండా డోర్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు.
పండగ సమయాల్లో రైలు ప్రయాణం కష్టమే. కన్ఫమ్ టికెట్ ఉండి ఏసీ బోగీల్లో ప్రయాణించేవారికిసమస్య అంతగా ఉండదు. కానీ .. దీపావళి సందర్భంగా రైల్లో గుజరాత్‌లోని వడోదర నుంచి మధ్యప్రదేశ్‌లోని రత్లాం వెళ్తున్న అన్షుల్ శర్మ అనే ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. థర్డ్ ఏసీ టికెట్ బుక్ చేసుకున్నా ఫలితం లేకపోయింది. అతడు ఎక్కాల్సిన థర్డ్ ఏసీ కంపార్ట్‌మెంట్ ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయింది. కనీసం లోపలికి అడుగు పెట్టడానికి వీలులేకుండా డోర్ దగ్గర ప్రయాణికులు కిక్కిరిసిపోయారు. తన టికెట్ కన్ఫర్మ్ అయ్యిందని, లోపలికి వెళ్లేందుకు సహకరించాలని అక్కడి ఆర్పీఎఫ్ సిబ్బందికి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. వాళ్లందర్నీ పక్కకు నెట్టి దారివ్వడం తమ వల్ల కాదని చేతులెత్తేశారు. దీంతో ఒళ్లుమండిన అన్షుల్ ఎక్స్ వేదికగా ఇండియన్ రైల్వేస్‌పై మండిపడ్డారు. ఇంత పనికిమాలిన నిర్వహణను ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దీపావళి పండగ చేసుకోనివ్వనందుకు థ్యాంక్స్ అనీ థర్డ్ ఏసీలో కన్ఫర్మ్ టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తిని ట్రైన్ ఎక్కనివ్వకుండా చేశారనీ భద్రత సిబ్బంది నుంచి ఎలాంటి సహకారం లేదనీ తనొక్కడిదే కాదు చాలా మంది ప్రయాణికులది ఇదే పరిస్థితి అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలను కూడా జత చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Andhra University: ఆంధ్రా యూనివర్సిటీకి A++ గ్రేడ్.. ఇక విదేశాల్లోనూ బ్రాంచ్‌లు పెట్టుకోవచ్చు
తాత కారు అని గుర్తుపట్టి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి
TOP 9 ET News: కల్కి టీమ్‌కు మరో లీక్ షాక్ | ఒక్కొక్కడి తుక్కు రేగ్గొడుతున్న బాబు
సల్మాన్ – షారుఖ్ మధ్య చిచ్చుపెట్టిన థియేటర్లో బాంబులు వీడియో
Salaar: ప్రభాస్ కోసం బరిలో దిగుతున్న కోహ్లీ.. సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ వైరల్
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

