తాత కారు అని గుర్తుపట్టి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి

కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలో జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు(Child) నలిగిపోయాడు. కారు పార్క్‌ చేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక కారు లోపలికి వచ్చింది. దానిని గమనించిన ఒక పిల్లాడు పక్కకు జరిగిపోయాడు.

తాత కారు అని గుర్తుపట్టి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్లిన రెండేళ్ల చిన్నారి

|

Updated on: Nov 15, 2023 | 9:56 AM

కేరళలోని కాసరగోడ్‌ జిల్లాలో జరిగిన ప్రమాదం ఓ కుటుంబంలో అంతులేని విషాదాన్ని నింపింది. తాత కారు కింద పడి రెండేళ్ల పసివాడు(Child) నలిగిపోయాడు. కారు పార్క్‌ చేస్తున్న సమయంలో ఈ ఘోరం జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇద్దరు చిన్నారులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఒక కారు లోపలికి వచ్చింది. దానిని గమనించిన ఒక పిల్లాడు పక్కకు జరిగిపోయాడు. అయితే.. అది తమ తాత కారు అని గుర్తుపట్టి రెండేళ్ల చిన్నారి మాత్రం ఎదురుగా వెళ్లాడు. కానీ ఆ విషయాన్ని అతడి తాత గమనించుకోలేకపోయాడు. వాహనాన్ని పార్క్‌ చేసేందుకు పక్కకు తిప్పడంతో.. దాని టైర్‌ కింద చిన్నారి నలిగిపోయాడు. ఈ విషయాన్ని పక్కనున్న మరో పిల్లాడు గుర్తించి కేకలు వేయడంతో.. ఏదో ప్రమాదం జరిగిందని కారులోని వ్యక్తి కిందికి దిగాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: కల్కి టీమ్‌కు మరో లీక్‌ షాక్‌ | ఒక్కొక్కడి తుక్కు రేగ్గొడుతున్న బాబు

సల్మాన్‌ – షారుఖ్‌ మధ్య చిచ్చుపెట్టిన థియేటర్లో బాంబులు వీడియో

Salaar: ప్రభాస్‌ కోసం బరిలో దిగుతున్న కోహ్లీ.. సోషల్ మీడియా హ్యాండిల్లో పోస్ట్ వైరల్

అమ్మాయితో దొరికిపోయాక.. ఎంత కవర్ చేసి ఏం లాభం బ్రో !!

Bigg Boss 7: ఇదెక్కడి లొల్లిరా దేవుడా.. ఆఖరికి నాగర్జున బలి! పాపం!

 

Follow us