ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్‌ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..

ఆకాశం నుంచి పడిన అతిపెద్ద ఐస్‌ గడ్డ !! ఇంటి కప్పును చీల్చుకుంటూ..

Phani CH

|

Updated on: Aug 23, 2023 | 9:49 AM

వేసవికాలంలో వడగళ్ల వాన పడటం మనం చూసాం. ఒక్కోసారి ఈ వడగళ్లు పెద్ద సైజులో కూడా పడుతుంటాయి. ఏకంగా క్రికెట్‌ బాల్‌ అంత సైజున్న వడగళ్లు పడటం మనం చూశాం. ఈ వడగళ్ల వానలతో ఇటు పంటలే కాదు, ఇళ్లుకూడా ధ్వంసం అయిన సంఘటనలూ లేకపోలేదు. అలాగే అప్పుడప్పుడూ ఇళ్లపై ఉల్కలు పడిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఓ ఇంటిపై ఏకంగా 10 కేజీల బరువున్న అతిపెద్ద ఐస్‌ గడ్డ పడింది. అమెరికాలోని మాసాచుషెట్స్ రాష్ట్రంలోని షిర్లీ పట్టణంలో ఆగస్టు 20న పడిందీ మంచుగడ్డ.

వేసవికాలంలో వడగళ్ల వాన పడటం మనం చూసాం. ఒక్కోసారి ఈ వడగళ్లు పెద్ద సైజులో కూడా పడుతుంటాయి. ఏకంగా క్రికెట్‌ బాల్‌ అంత సైజున్న వడగళ్లు పడటం మనం చూశాం. ఈ వడగళ్ల వానలతో ఇటు పంటలే కాదు, ఇళ్లుకూడా ధ్వంసం అయిన సంఘటనలూ లేకపోలేదు. అలాగే అప్పుడప్పుడూ ఇళ్లపై ఉల్కలు పడిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా అమెరికాలోని ఓ ఇంటిపై ఏకంగా 10 కేజీల బరువున్న అతిపెద్ద ఐస్‌ గడ్డ పడింది. అమెరికాలోని మాసాచుషెట్స్ రాష్ట్రంలోని షిర్లీ పట్టణంలో ఆగస్టు 20న పడిందీ మంచుగడ్డ. జెఫ్ ఇల్గ్ అనే వ్యక్తి 18వ శతాబ్దంలో కట్టిన ఓ ఇంటికి మరమ్మతులు చేసుకుని నివాసముంటున్నాడు. అతను ఇంట్లో ఉండగా పెద్ద శబ్దం రావడంతో ఏం జరిగిందా అని బయటికి వచ్చి చూశాడు. పెరట్లో ఓ పెద్ద మంచుగడ్డ కనిపించింది. తర్వాత ఇంటి కప్పుకు పడిన రంధ్రాన్ని చూశారు. అదృష్టవశాత్తు ఆ స్పాట్‌లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, తన జీవితంలో అంత పెద్ద హిమశకలాన్ని చూడడం ఇదే మొదటిసారి అని జెఫ్ చెప్పాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: మళ్లో బాంబు పేల్చిన రేణూ దేశాయ్‌ | యంగ్ హీరో మాటలకు చిరు ఎమోషనల్

రజినీ ఫ్యాన్స్‌ VS విజయ్‌ మన హీరో చుట్టూ మరో వివాదం!

Chiranjeevi: ‘ఆ ఒక్క మాటతో ఏడ్చారు’.. మరో సారి ఆ వీడియోను గుర్తకు తెచ్చుకుందాం..

Yendira Ee Panchayathi: యూత్‌ను ఫిదా చేస్తున్న ‘ఏందిరా ఈ పంచాయితీ’ లవ్‌ స్టోరీ

Bhola Shankar: వస్తున్నాడు భోళా.. OTT డేట్ ఫిక్స్‌ !! ఎప్పుడంటే ??

 

Published on: Aug 23, 2023 09:42 AM