Elephant Steals Woman : ఓ మహిళతో ఆడుకున్న గజరాజు.. ఆ తర్వాతన ఏం జరిగిందంటే..! వైరల్‌గా మారిన వీడియో..

గజరాజుతో ఓ మహిళ ఫోటో దిగాలనుకుంది. అనుకున్నదే తడువుగా ఫోటో కోసం దగ్గరగా ఫోజిచ్చింది. అయితే ఆ ఏనుగు మాత్రం..

Elephant Steals Woman : ఓ మహిళతో ఆడుకున్న గజరాజు.. ఆ తర్వాతన ఏం జరిగిందంటే..! వైరల్‌గా మారిన వీడియో..
Elephant steals woman
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 12, 2021 | 1:31 PM

Elephant steals woman: గజరాజుతో ఓ మహిళ ఫోటో దిగాలనుకుంది. అనుకున్నదే తడువుగా ఫోటో కోసం దగ్గరగా ఫోజిచ్చింది. అయితే ఆ ఏనుగు మాత్రం ఆ మహిళతో చిలిపిగా ఆడుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఆ మహిళ ఏనుగుకు దగ్గరగా వెళ్లింది… ఒక ఫోటో దిగింది.. మరో ఫోటో దిగేందుకు రెడీ అయ్యింది.

ఫోటో దిగుతున్న సమయంలో ఆ మహిళ హ్యాట్‌ను కొట్టేసింది ఏనుగు. ఇది గమనించిన ఏనుగు ఆ హ్యాట్‌ను తిసుకుని నోట్లో  దాచేసింది. అంతే మహిళ షాక్.. కొంత సేపు అక్కడే ఉండిపోయింది. కాసేపు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తూ నిలుచుంది.

ఆ సమయంలో.. దయచేసి నా టోపీని తిరిగి ఇవ్వండి, దయచేసి అని ఆ మహిళ ఏనుగును అభ్యర్థించింది. కొన్ని సెకన్ల తరువాత, సున్నితమైన ఏనుగు దాని నోటి నుండి టోపీని తీసి ఆ మహిలకు తిరిగి ఇస్తుంది. ఈ వీడియోను అమెరికా క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఏనుగు ఒక మహిళతో జోక్ చేసింది. అవి చాలా తెలివైనవి.. అనే క్యాప్షన్‌ తన పోస్ట్‌కు జోడించాడు.