David Warner: పుష్పకు వార్నర్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారేలా ఉన్నాడుగా.? ఈసారి కూతుళ్లు కూడా..
David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెటర్‌గా కేవలం క్రికెట్ అభిమానులకే తెలిసిన వార్నర్ సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితులుగా మారారు. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలకు...
David Warner: ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రికెటర్‌గా కేవలం క్రికెట్ అభిమానులకే తెలిసిన వార్నర్ సోషల్ మీడియా ద్వారా అందరికీ సుపరిచితులుగా మారారు. ముఖ్యంగా తెలుగు సినిమా పాటలకు తనదైన స్టైల్‌లో స్టెప్పులేస్తూ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వార్నర్ దృష్టి అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రంపై పడింది. వరుసగా ఈ సినిమా పాటలకు స్టెప్పులేస్తున్నాడు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో ఇప్పటికే శ్రీవల్లి, ఏయ్ బిడ్డా పాటలకు కాలు కదిపిన వార్నర్ సదరు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియోలు కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన మరో వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పుష్పలోని సామీ సామీ పాటకు వార్నర్ కూతుళ్లు వేసిన స్టెప్పులు వైరల్‌గా మారాయి. అచ్చం రష్మికను పోలిన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇక చివర్లో పుష్పరాజ్ తగ్గేదేలే మేనరిజంను చేయడం కొస మెరుపు. దీంతో ఈ వీడియో నెటిజన్లు కొందరు పుష్ప సినిమాకు వార్నర్ బ్రాండ్ అంబాసిడర్‌లా మారేలా ఉన్నాడని కామెంట్లు పెడుతున్నారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
View this post on Instagram
Also Read: Basil Health Benefits: తులసితో అద్భుతమైన ఉపయోగాలు.. పలు అధ్యయనాలలో కీలక విషయాలు!
Arunachal Tunnel: అరుణాచల్‌లో చైనా ఆగడాలకు త్వరలో చెక్.. కీలక దశకు బోర్డర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్!