రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఓ అటోలా మార్చాడు !! ఈ వ్యక్తి క్రియేటివిటీకి హాట్సాఫ్‌ !! వీడియో

టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోవడంతో చాలామంది తమలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు.

Phani CH

|

Jan 24, 2022 | 9:50 AM

టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ మధ్యకాలంలో ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైపోవడంతో చాలామంది తమలోని ప్రతిభను వెలికి తీస్తున్నారు. అక్కర్లేని వస్తువులతో అద్భుత ఇన్వెన్షన్లు చేసి వీక్షకులను భలేగా ఆకట్టుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దానిని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ‘వావ్’ అనాల్సిందే. సాధారణంగా బైక్‌‌పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణం చేస్తారు. అయితే ఇక్కడ ఏకంగా ఎనిమిది మంది ఒకే బైక్‌పై ప్రయాణించారు. వైరల్ వీడియో ప్రకారం.. ఓ బైక్ రైడర్.. తన రాయల్ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌ను ఓ అటోలా మార్చాడు. బైక్‌కు 10 అడుగుల పొడవాటి ఆటో సీట్‌ లాంటిది అమర్చి ఏకంగా 7గురిని కూర్చోపెట్టుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ వీడియోను ‘memewalanews’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. నెటిజన్లు లైకులు, ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Also Watch:

నాపేరు కొవిడ్‌.. నేను వైరస్‌ను కాను !! నెట్టింట్లో ఇంట్రో ఇచ్చుకున్న వ్యాపారవేత్త.. వీడియో

Viral Video: బబుల్స్‌తో కోతి ఫన్నీ ఆటలు !! నెట్టింట వీడియో వైరల్

సముద్రంలో చిక్కుకున్న వ్యక్తి !! సమయస్ఫూర్తితో కాపాడిన టూరిస్టులు !! వీడియో

సెలబ్రిటీ బాతు !! నెలనెలా లక్షల్లో సంపాదన !! వీడియో

న్యూటన్ ఫోర్త్ లా చెప్పిన చిన్నారి !! కరోనా-చదువు ఫార్ములా వైరల్ వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu