Tamil Nadu Viral Video: దెయ్యం పట్టిందని కొడుకుని కొట్టిచంపిన తల్లి..!వైరల్ అవుతున్న వీడియో
భూత వైద్యం పేరుతో ఏడేళ్ల బాలుడ్ని చిత్రహింసలు పెట్టి నిలువునా ప్రాణాలు తీసేసిన మూఢత్వం తమిళనాడులో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి చిత్రహింసలు పెట్టి చంపింది.
భూత వైద్యం పేరుతో ఏడేళ్ల బాలుడ్ని చిత్రహింసలు పెట్టి నిలువునా ప్రాణాలు తీసేసిన మూఢత్వం తమిళనాడులో చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి చిత్రహింసలు పెట్టి చంపింది. ఈ ఘటనలో తల్లి సహా మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా అరణిలో ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల పసివాడిని చిత్రహింసలు పెట్టారు. అది గమనించిన స్థానికులు కన్నమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పాపం..అప్పటికే బాలుడు మృతిచెందాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు మహిళలు పోలీసులు అరెస్ట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్లరి.. అందరూ ఫిదా: viral video.
వైరల్ వీడియోలు
Latest Videos