ఎడ్ల బండ్లపై పెళ్లి ఊరేగింపు.. జానపద పాటలు పాడుతూ… డాన్స్ చేస్తూ… ( వీడియో )

ఈ మధ్యకాలంలో చిన్న శుభకార్యం జరిగినా.. కార్లల్లో వెళుతున్నారు. ఇక పెళ్లికి అయితే.. లగ్జరీ కార్లల్లో ఊరేగింపుగా వెళుతున్నారు. అయితే.. ఈ వరుడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు.

  • Publish Date - 12:47 am, Tue, 22 June 21

ఈ మధ్యకాలంలో చిన్న శుభకార్యం జరిగినా.. కార్లల్లో వెళుతున్నారు. ఇక పెళ్లికి అయితే.. లగ్జరీ కార్లల్లో ఊరేగింపుగా వెళుతున్నారు. అయితే.. ఈ వరుడు మాత్రం వెరైటీగా ఆలోచించాడు. పాత సంప్రదాయలను గుర్తిచేసేలా.. ఎండ్లబండిపై ఊరేగింపుగా వెళ్లాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీనిని చూసిన వారంతా పాత సంప్రదాయాలను గుర్తుచేశాడంటూ కొనియాడుతున్నారు. ఉత్త‌రప్ర‌దేశ్‌కు చెందిన ఒక వ‌రుడు, త‌న కుటుంబ స‌భ్యులు, బంధువుల‌తో క‌లిసి ప‌లు ఎండ్ల బండ్ల‌పై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లారు. డియోరియా జిల్లాలోని కుషరి గ్రామం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పక్రీ బజార్‌లోని వివాహ వేదిక చేరుకోవడానికి వరుడి కుంటుంబ సభ్యులు ఎండ్ల బండ్ల‌ను వినియోగించారు. దీంతో ఆయా ప్రాంతంలోని ప్రజలు ఇళ్లనుంచి బయటకు వచ్చి ఈ ఊరేగింపును చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. పాత సంప్రదాయాలను గుర్తుకు తెచ్చారంటూ కొనియాడారు. అయితే.. డీజేకి బదులుగా ప్రజలు ఫరూహి జానపద పాటలకు నృత్యం చేస్తూ ఆనందంతో ముందుకుసాగారు. 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మెట్రో ట్రైన్‌లో బుద్దిగా ప్ర‌యాణం చేసిన కోతి.. నెట్టింట వైరల్ వీడియో..

Himachal Pradesh: టీ కొట్టుకు రూ.55 లక్షల కరెంటు బిల్లు.. కంగుతిన్న దుకాణదారుడు.. ( వీడియో )