ప్రమాదాన్ని సెకన్ల ముందే గ్రహించాయి.. మహిళను కాపాడిన పిల్లులు వీడియో
కొన్ని సందర్భాల్లో జంతువులు అద్భుత శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. మన కంటికి కనిపించనివి వాటికి కనిపిస్తాయి.. మన చెవులకు వినిపించనివి వాటికి వినిపిస్తాయి. వాటి వినికిడి శక్తి చాలా గొప్పది. చైనాలో పిల్లుల కారణంగా ఓ మహిళ పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది.
ఓ మహిళ హాలులో టీవీ ముందున్న సోఫాలో కూర్చుని మొబైల్ చూస్తూ ఉంది. రెండు పిల్లులు ఆమెకు కొద్ది దూరంలో ఉన్నాయి. ఓ పిల్లి టీవీ ముందు కూర్చుని అదే పనిగా గోడవైపు చూస్తూ ఉంది. మరో పిల్లి కూడా గోడవైపే చూస్తూ ఉంది. కొద్దిసేపటి తర్వాత రెండు పిల్లులు అలర్ట్ అయ్యాయి. ఏదో ప్రమాదం జరగబోతున్నట్లు అక్కడినుంచి పరుగులు తీశాయి. పిల్లులు అరుస్తూ పరుగులు తీయటంతో మహిళ ఫోన్‌లోంచి తలపైకెత్తింది. గోడవైపు చూసింది. గోడకు ఉన్న టైల్స్ ఒక్కసారిగా కూలిపోయాయి.ఆమె ఒక్క ఉదుటన అక్కడి నుంచి పరుగు తీసింది. గోడకున్న టైల్స్ మొత్తం ఊడి సోఫా వరకు వచ్చిపడ్డాయి. ఆమె కనుక అక్కడే కూర్చుని ఉంటే కచ్చితంగా గాయపడేది. పిల్లుల కారణంగా తప్పించుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘మేడిన్ చైనా టైల్స్ .. అందుకే ఊడిపోయాయి’..‘పిల్లుల వినికిడి శక్తి చాలా బలమైంది. అవి టైల్స్ ఉడిపోతున్న శబ్ధాన్ని ఇట్టే గ్రహించాయి’ అని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో
అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో
ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్, రోబోలతో సిరుల సేద్యం వీడియో
ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
