AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: టెన్షన్ ఎందుకు దండగా.. గోల్‌గప్పాలుండగా అంటోన్న వధువు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో

సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు తొలి స్థానంలో నిలుస్తాయి. వైవిధ్యమైన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటూ వైలర్‌గా మారుతున్నాయి.

Viral Video: టెన్షన్ ఎందుకు దండగా.. గోల్‌గప్పాలుండగా అంటోన్న వధువు.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో
bride eating golgappe
Venkata Chari
|

Updated on: Sep 06, 2021 | 9:06 AM

Share

Viral Video: గోల్‌గప్పా లేదా పానీపూరి పేరు వినగానే ప్రజల నోళ్లు ఊరుతాయనడంలో సందేహం లేదు. గోల్‌గప్పాకు ఎంతో మంది ప్రేమికులు ఉంటారు. అయితే, తన వివాహంలో వధువు కూడా పానీపూరికి పిధా అయింది. దీంతో అక్కడ చేసిన హాడావుడి.. నెట్టింట్లో వైరల్‌గా మారింది. వధువు పెళ్లి టెన్షన్ అంతా మర్చిపోయి సరదాగా పానీపూరిలు తినడంలో బిజీగా మారిన ఈ వీడియోను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.

సోషల్ మీడియాలో వివాహాలకు సంబంధించిన వీడియోల సునామీ కొనసాగుతూనే ఉంది. ప్రతీరోజు ఎన్నో వీడియోలు నెట్టింట్లో వచ్చి చేరుతున్నాయి. ఈ వీడియో విషయానికి వస్తే.. సాధారణంగా వివాహంలో, వధువు తన దుస్తులు, ఆభరణాలు, అలంకరణలో బిజీగా ఉండడమనేది సహజంగా మనం చూస్తుంటాం. అయితే ఈ వీడియోలోని వధువు కాస్త భిన్నంగా కనిపించింది. అతిథుల గురించి లేదా అలంకరణ గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తన వివాహంలో పానీపూరిలు తినడంలో బిజీగా మారిపోయింది. ఇందుకోసం ఎవరి సహాయం కూడా తీసుకోకుండా లాగించింది. పానీపూరిని ఇష్టపడే ఈ వధువు.. తన ప్లేట్‌లో స్వయంగా గోల్‌గప్పలు తయారుచేసుకుని తినడం చూడొచ్చు.

ఈ వధువు తన వివాహంలో గోల్‌గప్పను ఎంతో ఎంజాయ్‌ చేస్తు ఆస్వాదిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ గోల్గప్పలకు సంబంధించిన పాటలు పాడటం కూడా మనం వీడియోలో చూడొచ్చు. వివాహాల సీజన్‌లో ఇటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో దుల్హనియా అనే అకౌంట్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ప్రజలు చాలా ఇష్టపడుతున్నారు.

Also Read:

Viral Video: 90 నిమిషాల పోరాటం.. ముళ్ల పందిని వేటాడబోయిన చిరుత.. కట్ చేస్తే.!

Viral Video: గంటకు 180 కిలోమీటర్ల వేగంతో కారు.. రూఫ్‌పై తాళ్లతో బంధించిన యువకుడు.. పోలీసుల ఎంట్రీతో మారిన సీన్.. అసలేం జరిగిందంటే?

Virat Kohli: పెవిలియన్ చేరిన కోహ్లీ కోపంతో ఏంచేశాడో తెలుసా..? నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో