Cow – Vegetables: మానవత్వం ఇంకా మిగిలే ఉంది.. అందుకు సాక్ష్యమే ఈ వీడియో..!
అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు చూస్తే మానవత్వం ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది. అవును స్వలాభం లేకుండా పక్కవాడికి మాట సాయం కూడా చేయని ఈ రోజుల్లో ఎలాంటి లాభం ఉండకపోగా తనకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఓ మూగజీవిపట్ల
అప్పుడప్పుడూ కొన్ని సంఘటనలు చూస్తే మానవత్వం ఇంకా మిగిలే ఉందనిపిస్తుంది. అవును స్వలాభం లేకుండా పక్కవాడికి మాట సాయం కూడా చేయని ఈ రోజుల్లో ఎలాంటి లాభం ఉండకపోగా తనకు నష్టం వాటిల్లుతుందని తెలిసినా ఓ మూగజీవిపట్ల ఆవ్యక్తి చూపిన ఆదరణ నెటిజన్లను ఆలోచింపచేస్తుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో వ్యాపారులు కూరగాయాలు అమ్ముతున్నారు. ఇంతలో ఆ మార్కెట్‌లోకి ఓ ఆవు వచ్చింది. అక్కడ అమ్మకానికి పెట్టిన కూరగాయలను తినడం మొదలుపెట్టింది. అయితే ఆ వ్యాపారి ఆవు తన కూరగాయలు తినేస్తున్నా దానిని ఏమీ అనలేదు. పాపం ఎంత ఆకలితో ఉందో ఏమో అనుకుని ఆమె ఆవును ఏమీ అనలేదు. ఓ వైపు ఆవు కూరగాయలు తింటుంటే మరోవైపు ఆ మహిళా వ్యాపారి కస్టమర్స్‌కి కూరగాయలు అమ్ముకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని ఓ మార్కెట్లో జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆవుపట్ల ఆ మహిళ చూపిన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మహిళపై కామెంట్ల రూపంలో ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

