Snake in Helmet: హెల్మెట్లో పాము.. జస్ట్ మిస్..! బైక్‌పై లాక్‌చేసిన హెల్మెట్‌లో దూరిన పాము.

Snake in Helmet: హెల్మెట్లో పాము.. జస్ట్ మిస్..! బైక్‌పై లాక్‌చేసిన హెల్మెట్‌లో దూరిన పాము.

Anil kumar poka

|

Updated on: Oct 07, 2023 | 10:17 PM

బైకును పార్క్‌ చేసిన తర్వాత హెల్మెట్‌ను బైక్‌పైనే ఉంచి లాక్‌ చేసి వెళ్తుంటారు కొందరు. బయటకు వెళ్లేటప్పుడు మర్చిపోకుండా హెల్మెట్‌ పెట్టుకోడానకి ఇది ఉపయోగపడుతుందని అలాచేస్తుంటారు. కానీ అదే ఒక్కోసారి ప్రమాదాలకు దారితీయొచ్చు. ఎందుకంటే వాటిలో పాములో, పురుగులో మరేవైనా చేరవచ్చు. అవి గమనించకుండా మనం వాటిని ధరిస్తే ప్రమాదాలు సంభవించవచ్చు.

బైకును పార్క్‌ చేసిన తర్వాత హెల్మెట్‌ను బైక్‌పైనే ఉంచి లాక్‌ చేసి వెళ్తుంటారు కొందరు. బయటకు వెళ్లేటప్పుడు మర్చిపోకుండా హెల్మెట్‌ పెట్టుకోడానకి ఇది ఉపయోగపడుతుందని అలాచేస్తుంటారు. కానీ అదే ఒక్కోసారి ప్రమాదాలకు దారితీయొచ్చు. ఎందుకంటే వాటిలో పాములో, పురుగులో మరేవైనా చేరవచ్చు. అవి గమనించకుండా మనం వాటిని ధరిస్తే ప్రమాదాలు సంభవించవచ్చు. తాజాగా అలాంటి ఘటనే కేరళలో చోటుచేసుకుంది. బైక్‌పై లాక్‌చేసి ఉంచిన హెల్మెట్‌లోకి ఏకంగా నాగుపాము దూరింది. అదృష్టం బావుండి ముందుగా గమనించడంతో అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. త్రిస్సూర్‌లోని పుత్తూర్‌లో నివాసం ఉండే పొంటెకాల్‌ సోజన్‌.. తాను పని చేసే చోట బైక్‌ను పార్క్‌ చేసి, దానికి హెల్మెట్‌ను లాక్‌ చేసి ఉంచాడు. అక్టోబరు 4న ఆఫీసు అయిపోగానే ఇంటికి వెళ్లేందుకు బైక్‌ను తీస్తూ.. హెల్మెట్‌ పెట్టుకుందామని దానిని తీసాడు. అందులో ఏదో కదులుతున్నట్లు అనిపించేసరికి ఏమై ఉంటుందా అని పరిశీలించాడు. లోపల పాము కనిపించింది. హడలిపోయిన సోజన్‌ హెల్మెట్‌ను దూరంగా పెట్టి.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఆ శాఖకు చెందిన ఓ వాలంటీర్‌ అక్కడకు వచ్చి హెల్మెట్‌లోంచి పామును జాగ్రత్తగా బయటకు తీశాడు. రెండు నెలల వయసు ఉండే ఆ పామును సంచిలో వేసి తీసుకెళ్లాడు. దీంతో తనకు ప్రాణాపాయం తప్పిందని సోజన్‌ ఊపిరి పీల్చుకున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..