Monkeys: పెద్దపల్లి జిల్లాలో దారుణం.. కోతులను విషం పెట్టి చంపేశారు..
మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని అక్కడి వారు తెలిపారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని,
మూగజీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణానికి ఒడిగట్టారు. 35కు పైగా కోతులకు విషం పెట్టి చంపేశారు. వాటి కళేబరాలను ఓ శ్మశానం వద్ద పడేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల స్థానికంగా కోతుల బెడద ఎక్కువైపోయిందని అక్కడి వారు తెలిపారు. మైనింగ్ కారణంగా కొండలు కనుమరుగైపోవడంతో కోతులు గ్రామాలపై పడుతున్నాయని, ఈ క్రమంలోనే ఆగంతుకులు వాటిని విషప్రయోగంతో మట్టుబెట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. కోతుల కళేబరాలను చూసి షాకైపోయిన గ్రామస్తులు వెంటనే సర్పంచ్‌కు సమాచారం అందించారు. సర్పంచ్ అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం, పశువైద్య అధికారి వచ్చి పంచనామా జరిపించారు. సర్పంచ్, అటవీశాఖ సిబ్బంది ఫిర్యాదుతో మూగజీవాలను మట్టుపెట్టింది ఎవరో తేల్చేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. స్థానికుల్లో కొందరు ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని హామీ ఇచ్చారు. కాగా, కోతుల అంత్యక్రియల్లో గ్రామస్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మూగజీవాలకు తుది వీడ్కోలు పలుకుతూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

