Uttarakhand Glacier Burst Updates: తపోవన్ టన్నెల్‌లో చిక్కుకున్న 16 మంది సురక్షితం.. ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ..

Uttarakhand Glacier Burst Updates: దేవభూమి ఉత్తరాఖండ్‌ను మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. గ్లేసియర్ బరస్ట్ ఔట్‌తో ఊహించని విధంగా ఒక్కసారిగా జలప్రళయం..

Uttarakhand Glacier Burst Updates: తపోవన్ టన్నెల్‌లో చిక్కుకున్న 16 మంది సురక్షితం.. ఐటీబీపీ సిబ్బంది రెస్క్యూ..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 08, 2021 | 7:49 AM

Uttarakhand Glacier Burst Updates: దేవభూమి ఉత్తరాఖండ్‌ను మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి. గ్లేసియర్ బరస్ట్ ఔట్‌తో ఊహించని విధంగా ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడింది. నీటి మట్టం పెరగడంతో తపోవన్ టన్నెల్‌లో ఉన్న 16 మంది చిక్కుపోయారు. దీంతో ప్రాజెక్టులో చిక్కుపోయిన వారందరినీ ఐటీబీపీ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. ప్రమాద సమయంలో టన్నెల్‌లో ఉన్న కార్మికులంతా బురదలో చిక్కుకుయి బయటకు రాలేకపోయారు. ఐటీబీపీ సిబ్బంది సాహోసేపేతంగా సొరంగంలోకి దిగి అందులో ఉన్న వారినందరినీ బయటకు తీశారు. ప్రస్తుతం వారిని రెస్క్యూ చేసి బయటకు తీసుకువస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

కాగా.. ధౌలీ గంగా నది వరద ఉధృతి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా దాదాపు 170 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. వారంతా బురదలో చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. నిన్న రాత్రివేళ తగ్గిన ధౌలీ గంగా నది ఉధృతి సోమవారం తెల్లవారు జామున మళ్లీ పెరిగింది.

Also Read:

గంగమ్మ ప్రకోపానికి ఉత్తరాఖండ్ విలవిల.. జలప్రళయంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారంః సీఎం రావత్

Uttarakhand joshimath Dam News: ఉత్తరాఖండ్ లో డిజాస్టర్ కి కారణాలు ఎన్నో ! మెరుపు వరదల్లో గ్లేసియర్ ఔట్ బరస్ట్ అంటే ?

Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్​లో ఆకస్మిక వరద.. నీటమునిగిన గ్రామం.. 100 నుంచి 150 మంది మిస్సింగ్