Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక వరద.. నీటమునిగిన గ్రామం.. 100 నుంచి 150 మంది మిస్సింగ్
ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది. మంచు చరియలు విరిగిపడటం వల్ల ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది.
Uttarakhand joshimath dam news: ఉత్తరాఖండ్‌లోని హిమాలయాల్లో పెనుప్రమాదం సంభవించింది. మంచు చరియలు విరిగిపడటం వల్ల ధౌలిగంగా నది ఉప్పొంగి.. నీరంతా ఒక్కసారిగా దిగువకు ప్రవహించింది. ఈ ఘటనలో 100 నుంచి 150 మంది మరణించి ఉంటారని ఉత్తరాఖండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాశ్ వెల్లడించారు
ఆకస్మిక వరద కారణంగా చమోలీ జిల్లా రైనీ గ్రామంలోని తపోవన్ ప్రాంతం వద్ద ఉన్న రిషిగంగా పవర్ ప్రాజెక్టులోకి నీరు ప్రవేశించి దెబ్బతింది. రైనీ గ్రామంలో ఉన్న ఓ ఆనకట్ట కూడా ధ్వంసమైంది. ఈ డ్యామ్ దిగువన అనేక మంది లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తుంటారని తెలిపిన అధికారులు..వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఐటీబీపీ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉత్తరాఖండ్ ఘటన వివరాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా అడిగి తెలుసుకున్నారు. ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్, ఐటీబీపీ, ఎన్డీఆర్‌ఎఫ్ డీజీలతో చర్చించారు. ఇప్పటికే యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు సాగుతున్నట్లు వెల్లడించారు షా.
Also Read: