Davis Cup Coach Akhtar Ali: భారత టెన్నిస్ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్ అలీ కన్నుమూత.. పలువురి సంతాపం
Davis Cup Coach Akhtar Ali: భారత టెన్నిస్ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్ అలీ (83) కన్ను మూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన...
Davis Cup Coach Akhtar Ali: భారత టెన్నిస్ దిగ్గజం, డేవిస్ కప్ మాజీ కోచ్ అక్తర్ అలీ (83) కన్ను మూశారు. ప్రొస్టేట్ క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలతో ఆయన మరణించారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడతున్న అక్తరఅలీ.. రెండు వారాల కిందట కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం డేవిస్ కప్ కోచ్ జీషన్ అలీ అక్తర్ కుమారుడే. జీషన్‌అలీ, విజయ్ అమృత్‌రాజ్, రమేష్ కృష్ణన్ సహా చాలా మంది ఈ దిగ్గజ టెన్నిస్ కోచింగ్ వల్ల ప్రభావితమయ్యారు.
అక్తర్ అలీ అద్భుతమైన కోచ్. భారత టెన్నిస్‌కు గొప్ప సేవలందించారు. ప్రియమైన అక్తర్‌కు నివాళులు. జీషన్, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ విజయ్ అమృత్‌రాజ్ ట్వీట్ చేశారు. అలాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.