Ind vs Eng, 1st Test, Day 3, LIVE Score: ముగిసిన మూడో రోజు సెషన్.. ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు

Ram Naramaneni

| Edited By: Sanjay Kasula

Updated on: Feb 07, 2021 | 6:13 PM

Ind vs Eng, 1st Test, Day 3, LIVE Score: చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు ఉత్కంఠగా సాగింది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా​ 321 పరుగుల వెనుకంజలో ఉంది. ఆరు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.

Ind vs Eng, 1st Test, Day 3, LIVE Score: ముగిసిన మూడో రోజు సెషన్.. ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు

India vs England : చెన్నై చెపాక్ స్టేడియంలో తొలి టెస్టు ఉత్కంఠగా సాగింది. ఇన్నింగ్స్‌లో టీమిండియాకు ఆదిలోనే భారీ ఎదురుగు దెబ్బ తగిలింది. ఆర్చర్​బౌలింగ్​లో 3.3వ ఓవర్ వద్ద ఓపెనర్‌ రోహిత్​(6) పరుగులు చేసీ కీపర్​ బట్లర్‌‌కు క్యాచు ఇచ్చి ఇంటిదారి పట్టాడు. దీంతో భారత్​ 19 పరుగులకే తొలి వికెట్​చేజార్చుకుంది. ఆ తర్వాత శుభమన్​ గిల్​(29) కూడా ఆర్చర్​ బౌలింగ్‌లోనే అండర్సన్​ చేతికే చిక్కాడు. దీంతో భారత్​ 44 పరుగులు వద్ద రెండో వికెట్​ కోల్పోయింది. మొత్తంగా లంచ్ విరామానికి 14ఓవర్లకు టీమిండియా స్కోరు 59/2గా నమోదైంది.

రెండో సెషన్​లో క్రీజులోకి వచ్చిన కోహ్లీ 11 పరుగుల స్వల్ప స్కోరుకే పెవేలియన్ దారి పట్టించారు. డామ్​ బెస్​ వేసిన 25వ ఓవర్​నాలుగో బంతి విరాట్​ బ్యాట్ ఎడ్జ్‌కు తాకి షార్ట్​లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న ఓలీ పోప్​ చేతుల్లో పడింది. దీంతో భారత్​ 71 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది టీమిండియా.

అనంతరం క్రీజులోకి వచ్చిన రహానె కేవలం ఒకే ఒక్క పరుగు చేసి తిరిగివెళ్లిపోయాడు. ఫలితంగా 73 పరుగులకే నాలుగో వికెట్‌ను చేజార్చుకుని కష్టాల్లోకి జారిపోయింది. అనంతరం చెతేశ్వర్​ పుజారా, పంత్​ దూకుడుగా ఆడుతూ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. హాఫ్ సెంచరీ అద్భుతంగా ఆడి అందిరితో శభాష్ నిపించారుకున్నారు. ఇక టీ విరామం సమయానికి స్కోరు 154/4గా చేరింది.

మూడో సెషన్​లో పుజారా, పంత్​ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టారు. టీ20ని తలపించేలా దూకుడును ప్రదర్శించారు. 50.4ఓవర్​లో 192 పరుగులు వద్ద బెస్‌ బౌలింగ్​లో ఔట్​అయ్యాడు. పంత్​ 225 పరుగలు వద్ద ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. మొత్తంగా మూడో రోజు ఆటముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో అశ్విన్​(8), వాషింగ్టన్​ సుందర్​(33) ఉన్నారు. ఇంగ్లాండ్​ బౌలర్లలో డొమినిక్​ బెస్​(4), ఆర్చర్​(2) వికెట్లు తీశారు. అంతకుముందు ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 578 పరుగులకు ఆలౌట్​ అయింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 Feb 2021 05:33 PM (IST)

    తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా…

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా​ 321 పరుగుల వెనుకంజలో ఉంది. ఆరు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ఇంగ్లాండ్​ బౌలర్లలో డొమినిక్​ బెస్​(4), ఆర్చర్​(2) వికెట్లు తీశారు. క్రీజులో అశ్విన్​(8), వాషింగ్టన్​ సుందర్​(33) ఉన్నారు. అంతకుముందు ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 578 పరుగులు చేసి ఆలౌట్​ అయింది.

  • 07 Feb 2021 05:18 PM (IST)

    ముగిసిన మూడో రోజు సెషన్.. ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు

    ఆదివారం మూడవ రోజు ఆట ముగిసేసమయానికి టీమిండియా ఆరు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. సుందర్ (33), అశ్విన్ (8) నాటౌట్‌గా నిలిచారు. ఇంగ్లాండ్ కంటే టీమిండియా ఇంకా 321 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన ముందు ఇంగ్లాండ్ 578 పరుగుల భారీ టార్గెట్‌ను సంగతి తెలిసిందే. అయితే మూడో రోజు ఆటను మూడు ఓవర్ల ముందే ముగించారు.

  • 07 Feb 2021 04:07 PM (IST)

    బౌండరీతో ఖాతా తెరిచిన వాషింగ్టన్ సుందర్

    బౌండరీతో ఖాతా తెరిచిన వాషింగ్టన్ సుందర్. పంత్ స్టైల్‌లోనే వాషింగ్టన్ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. జాక్ లీచ్ వేసిన బంతిని బౌండరీకి పంపించాడు.

  • 07 Feb 2021 03:51 PM (IST)

    మరో బిగ్ వికెట్ పడింది…91 పరుగుల వద్ద పంత్ ఔట్

    చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో పంత్ 91 పరుగుల వద్ద ఔటయ్యాడు.  డోమ్ బెస్ వేసిన బంతిలో క్యాచ్ ఔటయ్యాడు. మొత్తం ఈ మ్యాచ్‌లో బెస్  4 వికెట్లు పడగొట్టాడు.

  • 07 Feb 2021 03:23 PM (IST)

    బిగ్ వికెట్! 50.4 ఓవర్లకు భారత్‌ 192/5: పుజారా ఔట్…

    బిగ్ వికెట్! డోమ్ బెస్‌ బౌలింగ్‌లో చేతేశ్వర్ పుజారా దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. టీమిండియా అయిదో వికెట్‌ కోల్పోయింది. బెస్‌ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించిన పుజారా.. బర్న్స్‌ చేతికి చిక్కాడు. అయితే బంతి నేరుగా బర్న్స్‌ చేతికి చిక్కలేదు. పుజారా పుల్‌షాట్‌కు యత్నించిగా మరో ఫీల్డర్‌కు తగిలి బంతి గాల్లోకి లేచింది.

  • 07 Feb 2021 03:14 PM (IST)

    పంత్-పూజారా జోడీ 100 పరుగులు..

    చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో పంత్, పూజారా 5 వ వికెట్‌కు భారత స్కోరుబోర్డుకు 100 పరుగులకు పైగా జోడించారు. ఈ పెద్ద భాగస్వామ్యంతో టీమిండియా ఇప్పుడు సంక్షోభం నెమ్మదిగా కోలుకుంటోంది.

  • 07 Feb 2021 02:51 PM (IST)

    బ్యాక్-టు-బ్యాక్ బౌండరీలతో దుమ్మురేపుతున్న పంత్

    ఇంగ్లాండ్ బౌలర్లకు రిషబ్ పంత్ చుక్కలు చూపిస్తున్నాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పంత్ బ్యాక్ టు బ్యాక్ బౌండరీలను బాదేశాడు.

  • 07 Feb 2021 02:43 PM (IST)

    మూడవ సెషన్ ఆట మొదలైంది…

    చెన్నై టెస్ట్ మ్యాచ్‌లో మూడవ రోజు చివరి సెషన్ ఆట ప్రారంభమైంది. పంత్,పూజారా ఈ సెషన్‌లో దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియాకు పుజారా, పంత్ జోడీ కొత్త ఆశలు నింపుతోంది.

  • 07 Feb 2021 02:22 PM (IST)

    టీ బ్రేక్.. టీమిండియా 41 ఓవర్లలో 154/4..

    టీ బ్రేక్, డే 3: భారత్ 41 ఓవర్లలో 154/4, టీమిండియా ఛేదనలో 424 పరుగుల దూరంలో ఉంది. ఆ సెషన్‌లో 95 పరుగులు వచ్చి రెండు వికెట్లు కోల్పోయారు. పంత్ (54 *), పూజారా (53 *) మధ్య 81 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

  • 07 Feb 2021 02:13 PM (IST)

    పూజారా అర్ధ సెంచరీ పూర్తి

    చెన్నై టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో చెతేశ్వర్ పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కెరీర్‌లో 29 వ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. గత 5 ఇన్నింగ్స్‌లలో అతని బ్యాట్ నుంచి ఇది నాలుగో అర్ధ సెంచరీ. అతను భారత ఇన్నింగ్స్ యొక్క 40 వ ఓవర్లో లీచ్ బంతికి ఒక ఫోర్ కొట్టడం ద్వారా ఈ అద్భుతమైన అర్ధ సెంచరీ పూర్తి.

  • 07 Feb 2021 01:37 PM (IST)

    పంత్ బ్యాక్-టు-బ్యాక్ సిక్సర్లు…

    దూకుడుగా ఆడుతున్న పుజారాకు వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ రిషబ్ పంత్ తోడయ్యాడు. బ్యాక్-టు-బ్యాక్ సిక్సర్లతో ఇంగ్లాండ్ స్పిన్నర్ల జాక్ లీచ్‌ బౌలింగ్‌ను ఉతికి ఆరేస్తున్నాడు.

  • 07 Feb 2021 01:33 PM (IST)

    దూకుడుమీదున్న పుజారా…

    వరస వికెట్లు పోయినా.. పుజారా మాత్రం తగ్గడం లేదు. దూకుడుగా ఆడుతున్నాడు. విరాట్, రహానె వికెట్లను తీసిన ఇంగ్లండ్ స్పిన్నర్ డోమ్ బెస్‌కు చుక్కలు చూపిస్తున్నాడు. చెన్నై టెస్టుల్లో కోహ్లీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కొద్దిగా ఒత్తిడికి లోనైంది.

  • 07 Feb 2021 01:18 PM (IST)

    విరాట్.. ఆ తరువాత రహానె ఔట్

    చెన్నై టెస్టులో ఇంగ్లండ్ స్పిన్నర్ చేతిలో రహానే దొరికిపోయాడు. రహానేగా 1 పరుగులకే అవుటయ్యాడు. అంతకుముందు టీమిండియా కెప్టెన్ కోహ్లీని ఔట్ చేశాడు. రహానే వికెట్‌తో చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండి 4 వికెట్లు కోల్పోయింది.

  • 07 Feb 2021 01:11 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్, మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా

    చెన్నై టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ సంక్షోభంలో ఉంది. విరాట్ కోహ్లీ ఔట్ అయ్యాడు. పెవేలియన్ దారి పట్టడంతో ఈ సంక్షోభం మరింత తీవ్రమైంది. కోహ్లీని డోమ్ బాస్ ఔట్ చేశాడు. విరాట్ క్రీజులో 65 నిమిషాలు ఉన్నాడు మరియు 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

  • 07 Feb 2021 12:41 PM (IST)

    క్రీజ్‌లో పాతుకుపోతున్న కోహ్లీ, పుజారా

    చెన్నై టెస్టులో మూడో రోజు రెండో సెషన్ ఆట ప్రారంభమైంది. విరాట్ కోహ్లీ, పుజారా క్రీజులో పాతుకుపోతున్నారు. క్రమంగా టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 578 పరుగులు చేసింది.

  • 07 Feb 2021 11:50 AM (IST)

    ఆదిలోనే భారీ కోహ్లీ సేనకు ఎదురుదెబ్బ..

    చెన్నై స్టేడియంలో ఇంగ్లాండ్‌ జరుగుతున్న తొలి టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌ మొదట్లోనే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. 19 పరుగుల వద్ద ఓపెనర్‌ రోహిత్ శర్మ(6) ఔట్ అయ్యాడు. కొద్ది సేపటికే మరో దూకుడు మీదున్న ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (29) భారీ షాట్‌ కోసం ప్రయత్నించి వెనుదిరిగాడు. దీంతో ఆదిలోనే భారత్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాగా అంతకుముందు పర్యటక ఇంగ్లాండ్‌ జట్టు 578 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆదివారం 555/8తో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో 23 పరుగులు జోడించి తొలి ఇన్సింగ్స్‌ను ముగించింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్స్‌లో రూట్‌ 218, సిబ్లీ 87, స్టోక్స్‌ 82 పరుగులు పోప్‌ 34, డొమినిక్‌ 34, బర్న్స్‌ 33, బట్లర్‌ 30 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా, అశ్విన్‌కు చెరో 3 వికెట్లు, ఇషాంత్, షాబాజ్‌ నదీమ్‌కు తలో 2 వికెట్లు దక్కాయి.

  • 07 Feb 2021 11:42 AM (IST)

    భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు – 59/2

    చెన్నై టెస్ట్‌లో మూడో రోజు లంచ్ బ్రేక్ సమయం వరకు రెండు వికెట్లను కోల్పోయింది కోహ్లీ సేన. తొలి ఇన్నింగ్స్‌లో భారీ టార్గెట్‌తో రంగంలోకి దిగిన టీమిండియాకు ప్రారంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. మరో  8 వికెట్లు మిగిలి ఉన్నాయి. క్రీజ్‌లో విరాట్, పూజారా జోడీ  నిలకడగా ఆడుతోంది.

  • 07 Feb 2021 11:26 AM (IST)

    50 పరుగుల మార్కును దాటిన టీమిండియా

    చెన్నై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 50 పరుగుల మార్కును దాటింది. అయితే, దీని కోసం కోహ్లీ సేన రెండు వికెట్లను కోల్పోవలసి వచ్చింది. రోహిత్ 6 పరుగులు, గిల్ 29 పరుగులు.

  • 07 Feb 2021 11:11 AM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన టీమిండియా

    భారీ టార్గెట్‌తో రంగంలోకి దిగిన భారత్‌కు కష్టాలు వెంటాడుతున్నాయి. దూకుడుగా ఆడుతున్న గిల్ భారీ షాట్‌ కోసం యత్నించి ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌలింగ్‌లో  షుబ్మాన్ గిల్ అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి పెవేలియన్ దారి పట్టాడు.  

  • 07 Feb 2021 11:01 AM (IST)

    అండర్సన్ ఒక ఓవర్లో బ్యాక్-టు-బ్యాక్ ఫోర్లు

    ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌ ఓవర్లో భారత ఓపెనర్ షుబ్మాన్ గిల్ బ్యాక్-టు-బ్యాక్ ఫోర్లు కొట్టాడు. అతను భారత ఇన్నింగ్స్ యొక్క 7 వ ఓవర్ యొక్క 3 మరియు 5 వ బంతుల్లో ఈ అద్భుతమైన చేశాడు. దీంతో భారత్‌ స్కోరు 7 ఓవర్ల తర్వాత 1 వికెట్‌కు 35 కి చేరుకుంది.

  • 07 Feb 2021 10:38 AM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన కోహ్లీ సేన.. హిట్ మ్యాన్ ఔట్

    చెన్నై స్టేడియంలో భారీ టార్గెట్‌తో రంగంలోకి దిగిన కోహ్లీ సేనకు ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవర్ 3వ బంతికి రోహిత్ శర్మ తన వికెట్‌ను కోల్పోయాడు.

  • 07 Feb 2021 10:27 AM (IST)

    భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీ సేన

    578 పరుగుల టార్గెట్‌తో టీమిండియా క్రీజ్‌లోకి వచ్చింది. రోహిత్, శుబ్మాన్ గిల్ క్రీజులో ఉన్నారు. రోహిత్ సమ్మెలో ఉన్నాడు.

  • 07 Feb 2021 10:23 AM (IST)

    190.1 ఓవర్లలో 578 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్

    చెన్నై చెపక్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో మూడవ రోజు ఇంగ్లాండ్ 578 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఓవర్‌నైట్‌ స్కోరు 555/8తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఇంగ్లండ్ మిగిలిన రెండు వికెట్స్‌కి త్వరగానే కోల్పోయింది. బెస్ 34 ప‌రుగులకు బుమ్రా బౌలింగ్‌లో వెనుదిర‌గ‌గా, అండ‌ర్స‌న్‌(1) అశ్విన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ టీమ్ 578 ప‌రుగుల‌ టార్గెట్‌ను కోహ్లీ సేన ముందుంచింది. భార‌త బౌల‌ర్స్‌లో అశ్విన్, బుమ్రా 3 వికెట్స్ తీయ‌గా, న‌దీమ్, ఇషాంత్ శ‌ర్మ చెరి రెండు వికెట్స్ తీసారు.

  • 07 Feb 2021 09:57 AM (IST)

    క్రీజులోకి జేమ్స్ ఆండర్సన్

    లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ జేమ్స్ ఆండర్సన్ క్రీజులోకి వచ్చాడు

  • 07 Feb 2021 09:55 AM (IST)

    9వ వికెట్ తీసిన బుమ్రా..

    బుమ్రా టు డోమ్ బెస్, అవుట్ ఎల్బిడబ్ల్యూ !! డోమ్ బెస్ 34 (105) ఎల్బిడబ్ల్యు.. బుమ్రా చేతిలో..  

  • 07 Feb 2021 09:53 AM (IST)

    ఈ రోజు తొలి బౌండరీ..

    అశ్విన్ టు డోమ్ బెస్.., ఫోర్, సూపర్ షాట్… లాంగ్-ఆన్‌లో దూకుడుగా బాదాడు. 

Published On - Feb 07,2021 6:13 PM

Follow us