Malla Reddy: ‘చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే నేనే ఫేమస్’.. మంత్రి మల్లా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీ9లో జరిగిన పొలిటికల్ కాన్‌క్లైవ్‌కి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. తాను చెప్పే పాలమ్మినా, పూలమ్మినా అని చెప్పే డైలాగ్ తన జీవితకాలం కష్టం అని వివరించారు. 1980 నుంచి 1990 మధ్య కాలంలో పాల వ్యాపారం చేసినట్లు తెలిపారు. 1990 నుంచి 2000 వరకూ బోర్ వెల్స్ నడిపించినట్లు చెప్పారు. 2000 తరువాత పూల వ్యాపారం చేసి, స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీ9లో జరిగిన పొలిటికల్ కాన్ క్లేవ్‌కి తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. తాను చెప్పే పాలమ్మినా, పూలమ్మినా అని చెప్పే డైలాగ్ తన జీవితకాలం కష్టం అని వివరించారు. 1980 నుంచి 1990 మధ్య కాలంలో పాల వ్యాపారం చేసినట్లు తెలిపారు. 1990 నుంచి 2000 వరకూ బోర్ వెల్స్ నడిపించినట్లు చెప్పారు. 2000 తరువాత పూల వ్యాపారం చేసి, స్కూళ్లు, కాలేజీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఆ తరువాత మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించి కష్టపడి ఈ స్థాయికి ఎదిగానన్నారు.
నేను ఈ డైలాగ్ ను ఎక్కడి నుంచో తీసుకురాలేదని తన వృత్తి గురించి చెబుతుంటే ఫేమస్ అయిపోయిందని తెలిపారు. ఈరోజుల్లో సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా మల్లారెడ్డికి సంబంధించిన వీడియోలే దర్శనమిస్తాయన్నారు. నేను తుమ్మినా తుఫాన్ అయిపోతుందని సరదాగా అన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కన్నా తానే ఫేమస్ అని కీలక వ్యాఖ్యలు చేశారు మల్లారెడ్డి. ఈ పేరు ఎందుకొస్తోంది అని ప్రశ్నించుకున్నారు. తాను ఒక కవి, సినిమా నటుడు, సెలబ్రిటీ కాదని సింపుల్ మ్యాన్ అని, లో ప్రొఫైల్, హై థింకింగ్ అంటూ నవ్వులు పూయించారు.
మల్లారెడ్డి వీడియో..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..