AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నవంబర్‌ మొత్తం.. చల్ల చల్లని కూల్‌కూల్‌

నవంబర్‌ మొత్తం.. చల్ల చల్లని కూల్‌కూల్‌

Phani CH
|

Updated on: Nov 21, 2025 | 1:15 PM

Share

నవంబర్‌లో తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో చలి తీవ్రత పెరిగింది. ఎనిమిదేళ్ల తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పడిపోయాయి. కుమ్రం భీం, ఆదిలాబాద్ జిల్లాల్లో 7-9°C, హైదరాబాద్‌లో 10.8°C నమోదయ్యాయి. మరో 48 గంటలు చలి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

నవంబరు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం అత్యంత చల్లగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో చలితీవ్రత కనిపిస్తుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గిపోయాయి. ముఖ్యంగా కుమ్రంభీమ్ అసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 7°C నుంచి 9°C మధ్య నమోదవడంతో నవంబర్‌లో అరుదుగా కనిపించే చలి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. రాజన్న సిరిసిల్లా , కామారెడ్డి , నిజామాబాద్ , సంగారెడ్డి , సిద్ధిపేట , నిర్మల్ 9 డిగ్రీల వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడం వాతావరణ తీవ్రతను స్పష్టంగా చూపించాయి. ఇప్పటికే రాష్ట్రం అంతటా చలి తన ప్రభావాన్ని మరింతగా విస్తరించడంతో ప్రజలు తెల్లవారుజామునే చలిమంటలవద్ద చేరుతున్నారు. హైదరాబాద్ లోనూ చలితీవ్రత బాగా పెరిగింది. నగర పరిసర ప్రాంతమైన సేరిలింగంపల్లి 10.8°C ఉష్ణోగ్రతను నమోదు చేసి ఈ సీజన్‌లో అత్యల్ప స్థాయికి చేరింది. రాజేంద్రనగర్ , బొల్లారమ్ , సికింద్రాబాద్ కాంటోన్మెంట్ 12 డిగ్రీల వద్ద కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. గచ్చిబౌలి, జీడిమెట్లలో ఉష్ణోగ్రత 13.3°Cకు పడిపోయింది. ముషీరాబాద్, బహదూర్‌పురా, కార్వాన్‌లో 14.1°C, జూబ్లీహిల్స్, మాధాపూర్ పరిసరాల్లో 14.5°C–15°C మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ప్రకారం.. మరో 48 గంటలు ఈ చలితీవ్రత కొనసాగుతుంది. ఈసారి నమోదవుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2018 నవంబర్‌కాలం శీతలతకు సరితూగుతున్నాయని IMD అధికారులు చెబుతున్నారు. వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 3 నుంచి 4°C తక్కువగా ఉండే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు. అసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మరింత చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణశాఖ అంచనా. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sabarimala: భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం

Cyclone Alert: దూసుకొస్తున్న మరో తుఫాన్‌ వాతావరణశాఖ పిడుగులాంటి వార్త

శివయ్య కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన పాములు.. హర హర మహాదేవ..

బర్గర్ తిని వ్యక్తి మృతి.. ఏం తినాలన్న భామేస్తుందిరా అయ్యా..

ఒక ‘పిల్లి’.. ఆ నగరాన్నే కదిలించింది..