బర్గర్ తిని వ్యక్తి మృతి.. ఏం తినాలన్న భామేస్తుందిరా అయ్యా..
అమెరికాలో ఓ వ్యక్తి పురుగు కుట్టిన రెడ్ మీట్ బర్గర్ తిని ప్రాణాలు కోల్పోయాడు. ఆల్ఫా-గాల్ సిండ్రోమ్‌తో మరణించిన తొలి కేసు ఇదే. ఆహార తయారీ సంస్థల నిర్లక్ష్యం, కల్తీ ఆహారం ప్రజల ఆరోగ్యంతో ఎలా చెలగాటమాడుతున్నాయో ఈ ఘటన హెచ్చరిస్తోంది. ఈ తీవ్రమైన అలర్జీ లక్షణాలు, కల్తీ ఆహారం వల్ల కలిగే ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి.
ఫుడ్ తయారీ వ్యాపార సంస్థలు ప్రజల ప్రాణాలను ఏ మాత్రం లెక్కచేయకుండా తమ ఇష్టారీత్యా కల్తీ, కుళ్ళిన ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్నాయి. వీటిని తిని జనం ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అమెరికాలో బర్గర్ తిన్న ఓ 47 ఏళ్ల వ్యక్తి ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. పురుగు కుట్టిన రెడ్ మీట్ తినడం వల్ల అతనికి ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. 2024లో ఈ ఘటన జరిగింది. వర్జీనియాలోని బృందం సదరు వ్యక్తి మరణంపై పరిశోధనలు చేసిన తర్వాత ఈ విషయం బయటపడింది. న్యూజెర్సీకి చెందిన 47 ఏళ్ల ఆ వ్యక్తి 2024లో ఓ హోటల్‌కు వెళ్లాడు. నాన్ వెజ్ బర్గర్ ఆర్డర్ చేసుకుని తిన్నాడు. అయితే, బర్గర్‌లోని రెడ్ మీట్ ఓ పురుగు కుట్టడం కారణంగా పాడైంది. ఆ బర్గర్ తిన్న అతడికి గలాక్టోస్ ఆల్ఫా 1తో పాటు 3 గలాక్టోస్ అలర్జీ వచ్చింది. బర్గర్ తిన్న కొన్ని గంటల తర్వాత వాంతులు చేసుకోవటం మొదలెట్టాడు. కుటుంబసభ్యులు అతడ్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. రెడ్ మీట్ తిన్న తర్వాత ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చి ఓ వ్యక్తి చనిపోవటం అనేది.. అమెరికాలో తొలి కేసు.పోస్టుమార్టం రిపోర్టులో అతను గుండెపోటు, శ్వాసకోశ సంబంధ, న్యూరోలాజికల్, పొట్టలో సమస్యల వల్ల చనిపోలేదని తేలింది. చనిపోయిన వ్యక్తి అన్ని అవయవాలను డాక్టర్లు నిశితంగా పరిశీలించారు. వాటిలో ఎలాంటి సమస్యా కనిపించలేదు. చాలా పరీక్షలు చేసిన తర్వాత అతడు ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వల్ల చనిపోయాడని తేల్చారు. ఆల్ఫా గాల్ సిండ్రోమ్ వచ్చిన వాళ్లు పాడైన మాంసాన్ని తినటం వల్ల కొన్నిసార్లు చనిపోయే అవకాశం ఉంది. ఆ వ్యక్తి విషయంలో అదే జరిగింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక ‘పిల్లి’.. ఆ నగరాన్నే కదిలించింది..
సంక్రాంతి ముందు నాన్వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

