ఉద్యోగులపై నిఘా !! 5 నిమిషాల పాటు మౌస్ ను ముట్టుకోకుంటే !!
ఐటీ రంగంలో ఉద్యోగుల పనితీరును కాగ్నిజెంట్, విప్రో వంటి కంపెనీలు నిశితంగా పర్యవేక్షిస్తున్నాయి. ప్రోహాన్స్ వంటి టూల్స్‌తో కీబోర్డు, మౌస్ కార్యకలాపాలను ట్రాక్ చేస్తూ ఉద్యోగులు ఎంతసేపు పని చేస్తున్నారో అంచనా వేస్తున్నాయి. ఇది ఉద్యోగుల గోప్యత, ఒత్తిడి, అభద్రతాభావానికి దారితీస్తోందని విమర్శలున్నాయి. కంపెనీలు మాత్రం వీటిని ఉత్పాదక టూల్స్‌గా పేర్కొంటూ, పనితీరు డేటా ప్రమోషన్లకు ఉపయోగపడదని అంటున్నాయి.
ఐటీ రంగంలో ఉద్యోగి ఏం చేస్తున్నారనేదానిపై నిత్యం నిఘా ఉంటుంది. ఒక ఉద్యోగి ఎంతసేపు పనిచేస్తున్నాడు? ఎంతసేపు ఖాళీగా ఉంటున్నాడనేది కంపెనీలు ఓ కంట కనిపెడుతూనే ఉంటాయి. కాగ్నిజెంట్ కూడా ఉద్యోగుల పై ఫోకస్ పెట్టింది. ఇందుకోసం కొత్త మానిటరింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది. కంపెనీ తాను ఇచ్చే ల్యాప్‌ట్యాప్‌లు, డెస్క్‌టాప్‌ల ద్వారా.. ఉద్యోగుల పనిని ట్రాక్ చేస్తోంది. వారు ఉపయోగించే కీబోర్డు, మౌస్‌లను ట్రాకింగ్ కోసం వినియోగిస్తోంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల ల్యాప్‌ట్యాప్ లేదా డెస్క్‌టాప్‌లో ఈ ట్రాకింగ్ కోసం ప్రోహ్యాన్స్ వంటి టూల్స్‌ను కాగ్నిజెంట్ ఉపయోగిస్తోంది. ఉద్యోగి ఖాళీగా ఉన్న సమయాన్ని ఈ టూల్ ట్రాక్ చేస్తుంది. మౌస్ కానీ, కీబోర్డు కానీ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇన్-యాక్టివ్‌గా ఉంచితే ఆ ఉద్యోగి ఖాళీగా ఉన్నట్లు పరిగణిస్తారు. అదే 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఇన్-యాక్టివ్‌గా ఉంటే వేరే పని చేస్తున్నట్లుగా అంచనా వేస్తారు. ఈ మానిటిరింగ్ వ్యవస్థ ఒక్కో టీమ్‌కు ఒక్కోలా ఉంటుందని తెలుస్తోంది. ఈ ట్రాకింగ్‌కి ఉద్యోగి పనితీరుకి కనెక్షన్ లేదని కంపెనీ అంటోంది. ప్రమోషన్లు, బోనస్ లో ఈ డేటాను ఉపయోగించమని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అన్ని సంస్థల మాదిరిగానే ఉత్పాదక టూల్స్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. విప్రో కూడా ప్రోహ్యాన్స్ టూల్స్‌ను వాడుతోంది. ఈ టూల్ వాడేందుకు ఉద్యోగి అంగీకారం తీసుకుంటున్నామని కంపెనీ చెబుతుండగా.. ఉద్యోగులు మాత్రం తప్పనిసరి నిబంధనగా చెబుతున్నారు. ఒక్కో టాస్క్‌పై ఎంతసేపు పనిచేస్తున్నారు? ఏ అప్లికేషన్‌ను ఎంతసేపు వాడుతున్నారు? సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఏఐ కారణంగా ఉద్యోగుల్లో ఇప్పటికే అభద్రతాభావం ఉంది. ఇలాంటి ట్రాకింగ్ టూల్స్ ద్వారా ఉద్యోగుల పనిపై నిఘా పెట్టడమంటే వారిని మరింత ఒత్తిడికి గురిచేయడమేనని పలువురు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆటోడ్రైవర్ మంచి మనసుకు నెటిజన్లు ఫిదా వీడియో
మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్‌బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
ఇదేం విచిత్రం.. మండు వేసవి ముందే వచ్చిందా వీడియో
మీరు గ్రేట్ సార్ ఓటు కోసం విమానంలో వచ్చి వీడియో
పాక్‌లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్

