Sabarimala: భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం
శబరిమలలో అయ్యప్ప దర్శనం కోసం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. లక్షలాది మంది పోటెత్తడంతో క్యూలైన్లు కిక్కిరిసి 16 గంటల నిరీక్షణ ఏర్పడింది. దీంతో ట్రావెన్‌కోర్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 5 వేలకు పరిమితం చేయడంతోపాటు, నీలక్కల్‌లో కొత్త కౌంటర్లు ప్రారంభించింది. భక్తుల ఇబ్బందులను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది.
శబరిమలకు భక్తుల రద్దీ రోజు రోజుకీ పెరుగుతోంది. రోజుకి 90 వేలమందికి దర్శనం కల్పించాలని ట్రావెన్‌కోర్ బోర్డ్ నిర్ణయించినప్పటికీ లక్షమందికి దాటి భక్తులు స్వామి దర్శనానికి పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల స్పాట్ బుకింగ్స్ 5 వేలకు పరిమితం చేయడంతోపాటు పలు ఆంక్షలు విధించింది. వార్షిక మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభమైన తొలిరోజు నుంచే శబరిమలకు భక్తులు భారీగా పోటెత్తారు. యాత్ర మొదలైన మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మందికి పైగా చేరుకోవడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. పంబ నుంచి సన్నిధానం మార్గంలోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి అయ్యప్ప దర్శనం కోసం తరలిరావడంతో క్యూలైన్లు నిండిపోయాయి. అయ్యప్ప దర్శనానికి 16 గంటలకు పైగా సమయం పడుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షిస్తున్న భక్తులకు సరైన ఏర్పాట్లు కూడా చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు సిబ్బంది, పోలీసులు రద్దీని నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే.. శబరిమల భక్తుల రద్దీతో ట్రావెన్ కోర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. స్పాట్ బుకింగ్స్‌ను 5 వేలకే పరిమితం చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ నెల 24 వరకు ఐదు వేల వరకే స్పాట్ బుకింగ్స్ ఉంటాయని స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం భారీగా తరలివస్తున్న భక్తులతో పంబ కిక్కిరిసిపోతుండటంతో.. కొత్తగా నీలక్కల్లో కూడా ఏడు స్పాట్ బుకింగ్ కౌంటర్లను ఓపెన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లోనే సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు రోజుల్లోనే దాదాపు మూడు లక్షల మంది అయ్యప్ప దర్శనానికి రావడం.. వర్చువల్ క్యూ బుకింగ్ చేసుకున్నవారు బుక్ చేసుకున్న రోజు రాకపోవడం, క్యూలైన్లను తప్పించుకోవడం లాంటి పరిణామాలు రద్దీకి కారణమవుతున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Cyclone Alert: దూసుకొస్తున్న మరో తుఫాన్ వాతావరణశాఖ పిడుగులాంటి వార్త
శివయ్య కోసం వందల సంఖ్యలో తరలి వచ్చిన పాములు.. హర హర మహాదేవ..
బర్గర్ తిని వ్యక్తి మృతి.. ఏం తినాలన్న భామేస్తుందిరా అయ్యా..
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??
వాట్సాప్లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
సంక్రాంతికి పల్లెబాట పట్టిన జనం

