AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chittoor: చిత్తూరు జిల్లాలో పుష్ప సీన్.. కూలీలతో పాటు ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

Chittoor: చిత్తూరు జిల్లాలో పుష్ప సీన్.. కూలీలతో పాటు ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

Anil kumar poka
|

Updated on: Jul 14, 2023 | 8:55 PM

Share

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేసారు. వారి నుంచి 6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల టీమ్‌ పీలేరు మెయిన్ రోడ్ లో తనిఖీలు చేస్తుండగా...

చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న కూలీలను పోలీసులు అరెస్ట్‌ చేసారు. వారి నుంచి 6 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల టీమ్‌ పీలేరు మెయిన్ రోడ్ లో తనిఖీలు చేస్తుండగా కొమిరెడ్డి గారి పల్లి క్రాస్ వద్ద కూలీలు కొందరు ఎర్రచందనం దుంగలను మోసుకుని వస్తూ కనిపించారు.వారిని సమీపించి చుట్టుముట్టేసరికి లొంగిపోయారు. మొత్తం 6 దుంగలను స్వాధీనం చేసుకుని కూలీలను స్టేషన్‌కు తీసుకువచ్చి కేసు నమోదు చేసారు పోలీసులు. కూలీలకు చెందిన ఇన్నోవా, బొలెరో వాహనాలతో పాటు ఓ బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం కూలీలు తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...