బెండ రైతు ఆవేదన.. టన్నుల కొద్దీ బెండకాయలు నీటిపాలు..
క్రమంగా కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. వినియోగదారులకు ఇది తీపి కబురే అయినా కష్టపడి పండించిన రైతు కన్నీటిపర్యంతమవుతున్నాడు. మొన్నటి వరకూ టమాటా రైతు ఇంట సిరులు కురిపించినా.. ఇప్పుడు అది కూడా నేలచూపులు చూస్తోంది. తాజాగా బెండకాయలు పండించిన రైతు గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్నాడు. తమిళనాడుకు చెందిన ఓ రైతు కష్టపడి పండించిన బెండకాయలను టన్నుల కొద్దీ తీసుకొచ్చి చెరువులో పడేసాడు.
క్రమంగా కూరగాయల ధరలు దిగివస్తున్నాయి. వినియోగదారులకు ఇది తీపి కబురే అయినా కష్టపడి పండించిన రైతు కన్నీటిపర్యంతమవుతున్నాడు. మొన్నటి వరకూ టమాటా రైతు ఇంట సిరులు కురిపించినా.. ఇప్పుడు అది కూడా నేలచూపులు చూస్తోంది. తాజాగా బెండకాయలు పండించిన రైతు గిట్టుబాటు ధర లేక గుండెలు బాదుకుంటున్నాడు. తమిళనాడుకు చెందిన ఓ రైతు కష్టపడి పండించిన బెండకాయలను టన్నుల కొద్దీ తీసుకొచ్చి చెరువులో పడేసాడు. తన ఆవేదనను గంగమ్మకు చెప్పుకని కన్నీటిపర్యంతమయ్యాడు. తమిళనాడు తిరుపత్తూర్ మార్కెట్ యార్డ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కిలో బెండకాయలు రెండు రూపాయలు పలకుతుండటంతో రైతు నోటమాట రాలేదు. ఎన్నోఆశలతో పండించిన పంటకు పెట్టుబడి కూడా రాకపోవడంతో తీవ్ర ఆవేదన చెందిన ఆ యువ రైతు తీవ్ర అసహనంతో నిగనిగలాడే 5 టన్నుల బెండకాయలను నీటిలో పడేశాడు. రైతు కష్టం నీటిసాలైంది. నీటిలో తేలుతున్న టన్నులకొద్దీ బెండకాయలు చూస్తే రైతు ఎంత ఆవేదన చెందాడో అర్ధమవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అర్ధరాత్రి ఇంటి ప్రాంగణంలో నాగుపాము హల్‌చల్ !! చివరికి ??
కెమెరాలో బంధించిన అండర్ వాటర్ ఫొటోగ్రాఫర్ !! వికృత ముఖంతో దెయ్యం చేప