Andhra Pradesh: ఏపీలో తెరమీదకు హత్యారాజకీయం.. జగన్‌పై కక్షగట్టిందెవరు.. ఎటాక్‌.. ఎవరి పని..?

|

Apr 14, 2024 | 9:45 PM

ఎన్నికల ముంగిట ఏపీ రాజకీయంలో సరికొత్త మలుపు. కాదు కాదు.. ఇదో పేద్ద కుదుపు. ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి... పొలిటికల్‌గా పెద్ద దుమారం రేపుతోంది. పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని అధికారపక్షం అంటుంటే.. అంతా అనుమానాస్పదమే అంటోంది విపక్షం. నిజానిజాలు పక్కనబెడితే.. ఏపీలో మరోసారి హత్యరాజకీయమనే అంశం తెరమీదకు వచ్చింది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో అసలు సిసలు ఎన్నికల వేడి ఇప్పుడు మొదలైందనిపిస్తోంది.

ఎన్నికల ముంగిట ఏపీ రాజకీయంలో సరికొత్త మలుపు. కాదు కాదు.. ఇదో పేద్ద కుదుపు. ప్రచారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడి… పొలిటికల్‌గా పెద్ద దుమారం రేపుతోంది. పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని అధికారపక్షం అంటుంటే.. అంతా అనుమానాస్పదమే అంటోంది విపక్షం. నిజానిజాలు పక్కనబెడితే.. ఏపీలో మరోసారి హత్యరాజకీయమనే అంశం తెరమీదకు వచ్చింది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో అసలు సిసలు ఎన్నికల వేడి ఇప్పుడు మొదలైందనిపిస్తోంది. సీఎం జగన్మోహన్‌రెడ్డిపై దాడి ఘటన… రాష్ట్ర రాజకీయాన్ని ఒక్కసారిగా హీటెక్కింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా.. ఇప్పుడు ఇదే వ్యవహారం చర్చనీయాంశమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మొదలు.. ప్రతిపక్షనేత చంద్రబాబు, రాజకీయ ప్రత్యర్థిగా మారిన చెల్లెలు షర్మిల, పక్కరాష్ట్రం తెలంగాణ నుంచి సీఎం రేవంత్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ దాకా.. అందరూ ఈ ఘటనను ఖండించారు.

ఘటనను ఖండించడాలు సరే.. రాజకీయంగా మాత్రం ఈ అంశం అగ్గి రాజేసింది. రాజకీయంగా ఎదుర్కోలేక జగన్‌ను అంతమొందించేందుకు.. టీడీపీ కుట్ర చేసిందని ఆరోపిస్తోంది అధికార వైసీపీ. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ… ఆయన రెచ్చగొట్టడం వల్లే దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది. కీలకనేత సజ్జల రామకృష్ణారెడ్డి సహా మంత్రులు, మాజీ మంత్రులు.. ఇది టీడీపీ పనేనని కరాఖండీగా చెబుతున్నారు.

అయితే, దీనిపై విపక్ష కూటమి నుంచి మాత్రం రాజకీయంగా భిన్నమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి.. సమగ్రమైన దర్యాప్తు జరగాలన్నారు. వైఎస్‌ షర్మిల సైతం.. సీఎంపై దాడిని ఖండించారు. అయితే, ఈ అంశంపై లోతైన విచారణ జరపాలన్న టీడీపీ… అధికారంలో ఉంటూ ఇలాంటి నాటకాలకు తెరలేపడం కరెక్టు కాదంటోంది. చిత్తశుద్ధి ఉంటే వెంటనే డీజీపీని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

రాజకీయంగా ఎవరి వాదన వారిదే.. కానీ, జరిగిన ఘటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. మరోసారి హత్యరాజకీయాలు తెరమీదకొచ్చాయి. నిజాలు నిగ్గుతేలితేగాని.. ఇది కుట్రా? మరొకటా? అనే విషయం బయటకురాదు. అప్పటిదాకా రాష్ట్రంలో రాజకీయంగా ఇదో అగ్నికణంలా రగులుతూనే ఉంటుందనడంలో సందేహం లేదు. విచారణలో ఏం తేలుతుందో, ఎప్పటికి తేలుతుందో చూడాలి.

లైవ్ వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..