Kishan Reddy: తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లి స్కామ్ చేశారు: కిషన్‌రెడ్డి

|

Mar 18, 2024 | 2:00 PM

తెలంగాణలో అత్యధిక స్థానాలకు కైవసం చేసుకునేందుకు బీజేపీ పక్కావ్యూహంతో ముందుకువెళ్తోంది. దీనిలో భాగంగా జగిత్యాల వేదికగా బీజేపీ విజయసంకల్ప సభను నిర్వహించింది. జగిత్యాల విజయసంకల్ప సభలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్లు మద్యం కుంభంకోణంతో తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు.

తెలంగాణలో అత్యధిక స్థానాలకు కైవసం చేసుకునేందుకు బీజేపీ పక్కావ్యూహంతో ముందుకువెళ్తోంది. దీనిలో భాగంగా జగిత్యాల వేదికగా బీజేపీ విజయసంకల్ప సభను నిర్వహించింది. జగిత్యాల విజయసంకల్ప సభలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్లు మద్యం కుంభంకోణంతో తెలంగాణ పరువు తీశారని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం తలదించుకునేలా..కేసీఆర్‌ కుటుంబం వ్యవహరించిందంటూ మండిపడ్డారు. పదేళ్లు BRS రాష్ట్రాన్ని దోచుకుందని.. కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందని తెలిపారు. తెలంగాణను దోచుకున్నది చాలక.. ఢిల్లీ వెళ్లి లిక్కర్‌ స్కామ్ చేశారంటూ విమర్శించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బీఆర్‌ఎస్‌ బాటలోనే నడుస్తోందని విమర్శించారు కిషన్‌రెడ్డి. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. మాట తప్పిందని మండిపడ్డారు. ఒకటో, రెండో గ్యారంటీలు అమలు చేసి.. మొత్తం చేశామని అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్‌కే చెల్లుందని ఆరోపించారు కిషన్‌రెడ్డి. గ్యారంటీల కాంగ్రెస్‌ మోసం చేసిందంటూ విమర్శించారు.

నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకుసాగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు నుంచి.. రామమందిరం నిర్మాణం వరకు ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..