కొన్ని గంటల్లో దేశ వ్యాప్తంగా నాలుగో విడత, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. అదే సమయంలో ఓటింగ్ శాతం పెంచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఓటింగ్ శాతం పెంచే కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గంలో కిషన్ రెడ్డి ఇంటరాక్షన్ విత్ న్యూ ఓటర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కిషన్ రెడ్డి కొత్త ఓటర్లతో ముచ్చటించారు. ఓటు ప్రాధాన్యతను వివరించారు. ఈ సందర్బంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు కేంద్ర మంత్రి. అలాగే దేశంలో రాజకీయాలు, అభివృద్ధి అంశాలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…