హీట్‌వేవ్‌ వార్నింగ్‌.. ఓటర్లకు ఈసీ కీలక సూచనలు

హీట్‌వేవ్‌ వార్నింగ్‌.. ఓటర్లకు ఈసీ కీలక సూచనలు

Phani CH

|

Updated on: Mar 28, 2024 | 8:28 PM

వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఓటర్లకు కీలక సూచనలు చేసింది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది.

వేసవి ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎండ తీవ్రత విపరీతంగా ఉంటోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలు కూడా వేసవిలోనే ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. హీట్‌వేవ్‌ నేపథ్యంలో ఓటర్లకు కీలక సూచనలు చేసింది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఎన్నికల సమయంలోనే ఎండలు కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో ఎలక్షన్‌ కమిషన్‌ ఓటర్లకు పలు సూచనలు చేసింది. ఎండలో బయటకు వెళ్లడం మానుకోవాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 12 నుంచి 3 మధ్య బయట పనులు మానుకోవాలి. దాహం వేయకపోయినా తరచూ వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకుంటూ ఉండాలి. తేలికైన, లైట్‌ కలర్‌, వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు రక్షణగా కళ్లజోళ్లు, గొడుగు లేదా టోపీ ఉపయోగించాలి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒక్క ఫోన్ కాల్‌.. 400 మంది ఉద్యోగాలు ఊడిపోయాయి

Jackfruit: పనసపండు తింటే ఆరోగ్యానికి 6 లాభాలు

హార్దిక్‌కు షాక్‌.. మళ్లీ రోహిత్‌కే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ బాధ్యతలు

పెరట్లో దొరికే ఈ పువ్వు చాలు.. నిమిషాల్లో మీ తెల్ల జుట్టును శాశ్వతంగా నల్లగా మారుస్తుంది

వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి