బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?

తెలంగాణలో వలసల రాజకీయం పీక్స్‌కు చేరిపోయింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ పెద్ద తలకాయలపై గురిపెట్టింది. తాజా పరిణామాల మధ్య... పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు. ఇవాళ ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసి..

బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
Brs
Follow us
Ravi Kiran

|

Updated on: Mar 28, 2024 | 7:08 PM

తెలంగాణలో వలసల రాజకీయం పీక్స్‌కు చేరిపోయింది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన కాంగ్రెస్‌.. బీఆర్‌ఎస్‌ పెద్ద తలకాయలపై గురిపెట్టింది. తాజా పరిణామాల మధ్య… పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్న బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీనేత కే. కేశవరావు. ఇవాళ ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసి.. తన నిర్ణయాన్ని అధినేత ముందు ఉంచారు. అయితే, కేకే తీరుపట్ల కేసీఆర్‌ అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే కేకే కూతురు, హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలె కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ దీపా మున్షీ ఆమెతో సమావేశమై పార్టీలోకి ఆహ్వానించారు. విజయలక్ష్మి నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ… ఇప్పుడు కేకే నిర్ణయం మరింత హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ అంశంపై కూడా కేసీఆర్‌కు కేకే వివరణ ఇచ్చినట్టు సమాచారం. అయితే, కేకే ఎపిసోడ్‌.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.