మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాలను వదిలిపెట్టారు ప్రధాని మోదీ. బర్త్ డే సందర్భంగా చీతాలను నేషనల్ పార్క్‌లో వదిలారు. మొత్తం 8 చీతాలను నేషనల్ పార్క్‌లో వదిలిపెట్టారు మోదీ. ఆ తర్వాత కునో నేషనల్ పార్క్‌ని పరిశీలించారు. జంతువుల సంరక్షణపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రధాని. తరువాత మహిళా సంఘాల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈసారి తన జన్మదినాన్ని తల్లితో జరుపుకోవాలని అనుకున్నానని , కాని మీతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు చాలా ప్రోత్సాహం ఇస్తునట్టు తెలిపారు మోదీ. స్కూళ్లలో 5000 స్కిల్ డెవలప్‌మెంట్ హబ్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఎక్కడో నమీబియా నుంచి మధ్యప్రదేశ్‌కు విశిష్ట అతిథులైన చీతాలు వచ్చాయని , ఆ అతిథులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. చీతాలకు స్వాగతం పలుకుతూ చప్పట్లో కొట్టాలని మహిళా సంఘాలకు సూచించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరటిపండ్లను చూస్తే ఎలుకలు పరుగో పరుగు !! ఎందుకో తెలుసా ??
నాగిని డ్యాన్స్ చేయమంటే నిజంగానే పాములా మారిపోయాడు !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
కడుపునొప్పితో అస్పత్రికెళ్లిన మహిళ.. స్కాన్ చేయగా వెలుగులోకి వచ్చిన స్టన్నింగ్ నిజం
వీల్‌ఛైర్‌లో ఫుడ్ డెలివరీ చేస్తోన్న యువతి !! హ్యాట్సాఫ్ అంటోన్న నెటిజన్లు