Rythu Bandhu: రైతు బంధుకు ఈసీ బ్రేక్.. లైవ్ వీడియో

Rythu Bandhu: రైతు బంధుకు ఈసీ బ్రేక్.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Nov 27, 2023 | 10:52 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. రేపటితో ప్రచారం ముగియనుండగా.. పోలింగ్ కు కౌంట్ డౌన్ షురూ కానుంది. దీంతో ప్రధాన పార్టీలు.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలనే రైతు బంధు నగదు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం.. గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. రేపటితో ప్రచారం ముగియనుండగా.. పోలింగ్ కు కౌంట్ డౌన్ షురూ కానుంది. దీంతో ప్రధాన పార్టీలు.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్నికల కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుబంధు నిధుల విడుదలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలనే రైతు బంధు నగదు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం.. గతంలో ఇచ్చిన అనుమతిని రద్దు చేస్తూ సోమవారం ప్రకటన విడుదల చేసింది. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఇచ్చిన ‘నో అబ్జెక్షన్’ను ఉపసంహరించుకున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ.. రైతుబంధుకు ఇచ్చిన అనుమతి రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. రైతుబంధు నిధులు విడుదల చేయవద్దని ఎన్నికల సంఘం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈసీ రెండు పేజీల లేఖను తెలంగాణ సీఈఓకు పంపింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్మిక-విజయ్ సీక్రెట్‌ బయటకు చెప్పేసిన రణ్‌బీర్‌

రష్మిక డీప్‌ఫేక్‌పై త్వరలో అరెస్ట్‌లు !! ఆధారాలు దొరికాయన్న ఢిల్లీ పోలీసులు

విమానాశ్రయంలో షాకింగ్ ఘటన.. పాపం పిల్లాడు.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఈ AI మోడ‌ల్‌ సంపాదన నెల‌కు రూ. 3 ల‌క్ష‌లు

పోలీస్‌ స్టేషన్‌ ముందు మహిళ వింత ప్రవర్తన.. డబ్బులు వెదజల్లుతూ

Published on: Nov 27, 2023 10:40 AM