రష్మిక డీప్‌ఫేక్‌పై త్వరలో అరెస్ట్‌లు !! ఆధారాలు దొరికాయన్న ఢిల్లీ పోలీసులు
స్టార్ నటి రష్మిక మందన్నా కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో తమకు కీలకమైన ఆధారాలు లభించినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించారు. సాంకేతిక విశ్లేషణ ద్వారా వాటిని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీ తెలిపారు.
స్టార్ నటి రష్మిక మందన్నా కు సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో ఇటీవలే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు విచారణ చేస్తున్నారు. డీప్‌ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు దర్యాప్తులో తమకు కీలకమైన ఆధారాలు లభించినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా వెల్లడించారు. సాంకేతిక విశ్లేషణ ద్వారా వాటిని పరిశీలిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ హేమంత్ తివారీ తెలిపారు. ఏ అడ్రెస్ నుంచి వీడియో అప్‌లోడ్ అయ్యిందో గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల్ని త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని చెప్పారు. రష్మిక మందన్నాకు సంబంధించిన ఓ డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు నోటీసు పంపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానాశ్రయంలో షాకింగ్ ఘటన.. పాపం పిల్లాడు.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఈ AI మోడల్ సంపాదన నెలకు రూ. 3 లక్షలు
పోలీస్ స్టేషన్ ముందు మహిళ వింత ప్రవర్తన.. డబ్బులు వెదజల్లుతూ
ట్రాక్టర్ పైన 7 అడుగుల ఎత్తులో కూర్చుని డ్రైవింగ్ !! ఎందుకంటే ??
ఇక తనివి తీరా ఏడవండి !! వీపింగ్ బాయ్‌ను ఐడియాను అమల్లోపెట్టిన హిరోకి టెకాయ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

