అయోధ్యకు 11 మంది యువకులు సైకిల్ యాత్ర..
అయోధ్య భవ్యదివ్య రామమందిరంలో కొలువుతీరనున్న శ్రీరామచంద్రుని దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలలనుంచి సిద్ధమవుతున్నారు. భారత రైల్వే భక్తుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసింది.. ఇక విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కొందరు భక్తులు శ్రీరామదర్శనం కోసం సైకిల్ యాత్రను చేస్తున్నారు. కర్నాటక బీదర్‌నుంచి కొందరు యువకులు అయోధ్య రామజన్మభూమికి సైకిల్ యాత్రగా బయలుదేరారు.
అయోధ్య భవ్యదివ్య రామమందిరంలో కొలువుతీరనున్న శ్రీరామచంద్రుని దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలలనుంచి సిద్ధమవుతున్నారు. భారత రైల్వే భక్తుల కోసం ప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసింది.. ఇక విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కొందరు భక్తులు శ్రీరామదర్శనం కోసం సైకిల్ యాత్రను చేస్తున్నారు. కర్నాటక బీదర్‌నుంచి కొందరు యువకులు అయోధ్య రామజన్మభూమికి సైకిల్ యాత్రగా బయలుదేరారు. 6వ రోజున తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న యువకులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వాగతం పలికారు. కర్ణాటక నుండి బీదర్ నుండి బయలుదేరిన 11 మంది యువకుల సైకిల్ యాత్ర 6వ రోజున ఆదిలాబాద్ కు చేరుకుంది. వీరికి పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వాగతం పలికారు. వారి ప్రయాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచం నలుమూలల నుండి రామభక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారని, వారందరికీ శ్రీ రాముని ఆశీస్సులు సదా ఉంటాయని అన్నారు. మఠం పీఠాధిపతి యువకులను ఆశీర్వదించి ముందుకు సాగనంపారు. జనవరి 22 న అయోధ్యలో జరిగే ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆదిలాబాద్ నుండి బయలుదేరే భక్తుల కోసం ప్రత్యేక రైలును మరియు బస్సు సర్వీసులను ఏర్పాటు చేయనున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫ్రీ అని బస్సెక్కారు.. సీట్ల కోసం సిగపట్లు పట్టారు
మత్స్యకారుల పంటపండింది.. వలలో పడ్డ అతిపెద్ద చేప..
తాగొచ్చిన కానిస్టేబుల్…స్టేషన్లో ఏం చేశాడో తెలుసా ??