వంతెన కింద ఇరుక్కున్న విమానం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

వంతెన కింద ఇరుక్కున్న విమానం.. భారీగా ట్రాఫిక్‌ జామ్‌

Phani CH

|

Updated on: Jan 01, 2024 | 3:09 PM

బీహార్‌లోని మోతీహారిలో ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోయింది. చివరకు అతికష్టం మీద దానిని బయటకు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. విమానం బాడీని ముంబై నుంచి అస్సాంకు ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్నారు. అయితే బీహార్‌లోని మోతీహారీలో పిప్రకోఠి వంతెన కింద అది ఇరుక్కుపోయింది. దీంతో లారీ డ్రైవర్లు స్థానికుల సహాయంతో దానిని బయటకు తీశారు.

బీహార్‌లోని మోతీహారిలో ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్న విమానం భాగం వంతెన కింద ఇరుక్కుపోయింది. చివరకు అతికష్టం మీద దానిని బయటకు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. విమానం బాడీని ముంబై నుంచి అస్సాంకు ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తున్నారు. అయితే బీహార్‌లోని మోతీహారీలో పిప్రకోఠి వంతెన కింద అది ఇరుక్కుపోయింది. దీంతో లారీ డ్రైవర్లు స్థానికుల సహాయంతో దానిని బయటకు తీశారు. ఈ సందర్భంగా క్రాస్‌ రోడ్ల వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. గతంలో కూడా పలు చోట్ల ఇలాంటి సంఘటనలు జరిగాయి. గత ఏడాది నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఒక సంఘటన జరిగింది. కొచ్చి నుంచి హైదరాబాద్‌కు విమాన భాగాన్ని ట్రక్కు ట్రైలర్‌పై తరలిస్తుండగా అండర్‌పాస్‌ వద్ద ఇరుక్కుపోయింది. అలాగే కోల్‌కతాలోపాటు పలు ప్రాంతాల్లో కూడా వంతెన కింద విమాన భాగాలు ఇరుక్కున్న సంఘటనలు జరిగాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్యలో విమానాశ్రయం, రైల్వే స్టేషన్‌ విశేషాలివే

నదినే రన్‌వేగా పొరబడ్డ పైలట్‌.. దానిపైనే విమానం ల్యాండింగ్

అయోధ్యకు 620 కిలోల గంట.. దానిపై జై శ్రీరామ్ అని రాసి ఉండటం దీని ప్రత్యేకత

భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలు బలోపేతం చేయనున్న భారత్..

అదిలాబాద్‌నుంచి అయోధ్యకు అక్షింతలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు