భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలు బలోపేతం చేయనున్న భారత్..
దేశ భద్రత విషయంలో కేంద్రప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో నిఘావ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. ఇటీవల చైనా, పాకిస్థాన్ చర్యల దృష్ట్యా ఆ దేశాల కదలికలపై ప్రత్యేక నిఘా అవసరమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టే యోచనలో ఉంది. ఇందులో భారత అంతరిక్ష నిఘా కీలకం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రానున్న కాలంలో భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనుంది.
దేశ భద్రత విషయంలో కేంద్రప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో నిఘావ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. ఇటీవల చైనా, పాకిస్థాన్ చర్యల దృష్ట్యా ఆ దేశాల కదలికలపై ప్రత్యేక నిఘా అవసరమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టే యోచనలో ఉంది. ఇందులో భారత అంతరిక్ష నిఘా కీలకం కానుందని తెలుస్తోంది. ఈ క్రమంలో, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రానున్న కాలంలో భారీ సంఖ్యలో నిఘా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టనుంది. దీనిపై ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ స్పందించారు. భారత్ బలమైన దేశంగా ఎదగాలంటే ఉపగ్రహ సాధన సంపత్తి కూడా పెరగాలని, ఇప్పుడున్న ఉపగ్రహ వ్యవస్థల కంటే 10 రెట్లు అధికంగా ఉండాలని స్పష్టం చేశారు. దీనికోసమే రాబోయే ఐదేళ్లలో 50 నిఘా ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. భౌగోళిక నిఘా సమాచార సేకరణే ఈ ఉపగ్రహాల ప్రయోగం వెనుక ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగల సామర్థ్యంలోనే ఆ దేశం యొక్క బలమేంటో తెలుస్తుందని సోమనాథ్ అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అదిలాబాద్‌నుంచి అయోధ్యకు అక్షింతలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో

