ఓ సినీనటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. సినీ నటుడిని పరామర్శించేందుకు హీరోలంతా క్యూకడుతున్నారని.. కానీ చావుబతుకుల్లో ఉన్న బాలుడ్ని పరామర్శించలేదన్నారు. కాలుపోయిందా.. కన్నుపోయిందా ఎందుకు పరామర్శించారని ప్రశ్నించారు.