పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ దీనిపై ప్రకటన చేయాలని కోరుగా రేవంత్ రెడ్డి స్పందించారు. తొక్కిసలాట జరిగిన తర్వాత థియేటర్ నుంచి వెళ్లిపోవాలని అల్లు అర్జున్‌కు పోలీసులు సూచించినట్లు తెలిపారు.